‘స్మార్ట్‌’గా పనిచేసే వాచీ!

13 Jul, 2017 08:31 IST|Sakshi
‘స్మార్ట్‌’గా పనిచేసే వాచీ!
ఈ ఫొటోలో ఉన్న వాచీ చూశారా.. ఇందులో ప్రత్యేకత ఏంటంటే దీనికి బ్యాటరీ అనేది అసలు అవసరముండదు. మీ శరీర కదలికల ఆధారంగానే వాచీ పనిచేసేందుకు సరిపడా విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు ఇందులో ఏర్పాట్లు ఉన్నాయి. దీని ప్రత్యేకతలు ఇక్కడితో అయిపోలేదు.. గుండె కొట్టుకునే వేగాన్ని లెక్కపెట్టే సెన్సర్‌తో పాటు జీపీఎస్, మీరు వేసే అడుగుల లెక్కలు చెప్పే, నడిచిన దూరాన్ని లెక్కించే ఫీచర్లు కూడా ఉన్నాయి.

స్విట్జర్లాండ్‌కు చెందిన ఓ కంపెనీ తయారు చేసిన ఈ వాచీని వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు ప్రస్తుతం కిక్‌ స్టార్టర్‌లో నిధులు సేకరిస్తున్నారు. దాదాపు 83 వేల డాలర్లు సేకరించాలని అనుకుంటే.. ఇప్పటికే దాదాపు 3.3 లక్షల డాలర్లు వచ్చాయి. ఈ స్మార్ట్‌ వాచీ మీకు కావాలనుకుంటున్నారా? కిక్‌స్టార్టర్‌కు వెళ్లి ఈ ప్రాజెక్టును సపోర్ట్‌ చేయడం ద్వారా రూ.12 వేలకు బేసిక్‌ మోడల్‌ వాచీ పొందొచ్చు. డెలివరీ మాత్రం డిసెంబర్‌లో వస్తుంది. వాచీ పేరు సీక్వెంట్‌! 
మరిన్ని వార్తలు