విషాదం : కళ్ల ముందే సముద్రంలో కలిసిపోయాయి

4 Jun, 2020 18:15 IST|Sakshi

నార్వే : జూన్‌ 3న ఉత్తర నార్వేలో ఒక విషాద సంఘటన చోటు చేసుకున్నది. అనేక ఇళ్లను సముద్రం తనలోకి లాగేసుకున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ వీడియోను అల్టా నివాసి అయిన జాన్ ఫ్రెడ్రిక్ డ్రాబ్లోస్ ట్విటర్‌లో షేర్‌ చేశాడు. 'అయ్యో ఎంత విషాదం.. చూస్తున్నంతసేపట్లో కొండచరియలతో పాటు అనేక​ ఇళ్లను సముద్రం తనలో కలిపేసుకుంది' అంటూ క్యాప్షన్‌ జత చేశాడు.(పానీపూరి ప్రియుల‌ను క‌ల‌వ‌ర‌ప‌రిచే వంట‌కం)

దాదాపు రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో మొదట్లో వాతావరణం అంతా కూల్‌గా, ప్రశాంతంగా కనిపిస్తుంది. ఆ తర్వాత బాగా గమనించినట్లయితే ఇళ్లన్నీ కదులుతున్నట్లుగా అనిపిస్తుంది. తీరా కాసేపటికి అవన్నీ నీటిలో కలిసిపోయాయి. అసలు ఇదంతా నిజమా లేక గ్రాఫిక్సా అనే అనుమానం కలిగేలోపే జరగాల్సింది జరిగిపోయింది. అయితే ఇదంతా నిజమే.. ప్రస్తుతం ఈ వీడియోను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటివరకు ఈ వీడియోను దాదాపు 1.6 మిలియన్‌ మందికి పైగా వీక్షించారు.' ఇది నిజంగా భయానకం'.. ' 2020 మనకు ఏ మాత్రం కలిసిరావడం లేదు' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. (కోతి, కింగ్‌ కోబ్రాల ఒళ్లు గగుర్పొడిచే ఫైట్‌)

మరిన్ని వార్తలు