జింక ఓ మహిళను పగబట్టిన వేళ..

2 Oct, 2016 18:00 IST|Sakshi
జింక ఓ మహిళను పగబట్టిన వేళ..

న్యూజెర్సీ: సాధారణంగా పాములు పగబడతాయంటే విన్నాము.. మనుషులు పగబడతారంటే నిజంగా చూశాం. కానీ, బెదురుబెదురుగా ఉంటూ చీమ చిటుక్కుమన్న చెవులు నిక్కపొడుచుకొని తలపైకెత్తి చూసి పారిపోయేందుకు సిద్ధంగా ఉండే జింకలు కూడా పగబడతాయంటే నమ్ముతామా.. కానీ, నమ్మాలి. న్యూజెర్సీలో ఓ కొమ్ముల జింక ఇలాగే చేసింది. తనను ఢీకొట్టిన ఓ ఎస్యూవీ వాహనం నడుపుతున్న మహిళపై తన కసి కొద్దిగా దాడికి దిగింది.

తన కొమ్ములతో డోర్ ఓపెన్ చేసి మరి యుద్ధం చేసినంతపని చేసి ఆమెకు చుక్కలు చూపించింది. ఈ క్రమంలో ఆమె కాలికి గాయం కూడా అయింది. అయితే, ఏదో ఒకలా ఆ జింక గట్టిగా తన్ని బయటపడిన ఆమె వెంటనే డోర్ వేసుకుంది. కానీ, కారుతగలడంతో గాయాలపాలయిన ఆ జింకా కొద్ది సేపటి తర్వాత చనిపోయింది. ఇద్దరు వ్యక్తులు కలిసి జాలిగా షికారుకు వెళుతుండగా రాత్రి పూట కొద్ది రోజుల కిందట ఈ ఘటన చోటుచేసుకుంది. ఇదంతా పెట్రోలింగ్ కు వెళుతున్న ఓ అధికారి కారులోని డాష్ క్యామ్ లో రికార్డవ్వగా దానిని తాజాగా విడుదల చేయడంతో వైరల్ గా మారింది.

మరిన్ని వార్తలు