టీవీ ప్రియులకు పెనుముప్పు

24 Feb, 2018 03:26 IST|Sakshi

వాషింగ్టన్‌: గంటల కొద్దీ టీవీల ముందు కూర్చునేవారి సిరల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉందని ఓ అధ్యయనంలో తేలింది. టీవీలు చూస్తూ కూర్చోవటం వల్ల  కాళ్లకు రక్తప్రసరణ పూర్తిస్థాయిలో జరగక సిరల్లో రక్తం గడ్డలు(వీన్స్‌ థ్రోమ్బోంబోలిజం–వీటీఈ) ఏర్పడే అవకాశముందని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మిన్నెసొటా శాస్త్రవేత్తలు తేల్చారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వ్యక్తులు సైతం టీవీ చూడడం, కదలకుండా ఒకేచోట ఎక్కువసేపు కూర్చోవడం వంటివాటికి దూరంగా ఉండాలని  శాస్త్రవేత్తలు సూచించారు.

మరిన్ని వార్తలు