హంసరాశి గ్రహంపై నీటి ఆవిరి!

26 Sep, 2014 02:23 IST|Sakshi
హంసరాశి గ్రహంపై నీటి ఆవిరి!

మనకు 120 కాంతి సంవత్సరాల దూరంలో.. హంస రాశిలోగల ఓ నక్షత్రం చుట్టూ తిరుగుతున్న గ్రహంపై కూడా నీటి ఆవిరి ఉందట. మామూలుగా ఇతర నక్షత్రాల చుట్టూ ఉన్న గ్రహాలు మన భూమికన్నా చాలా పెద్దగా ఉంటాయి. వాటిని అధిగ్రహాలుగా పిలుస్తారు. అయితే హ్యాట్-పీ-11బీ అనే ఈ అధిగ్రహం.. నీటి ఆవిరితో ఉన్నట్లు కనుగొన్న అన్ని అధిగ్రహాల్లోకెల్లా అతి చిన్నదట.  
 
నెప్ట్యూన్ అంత సైజులో ఉన్న ‘హ్యాట్-పీ’ని నాసా/ఈసా హబుల్, స్పిట్జర్, కెప్లర్ టెలిస్కోపుల సాయంతో మధుసూదన్ అనే భారత సంతతి శాస్త్రవేత్తతో కూడిన అంతర్జాతీయ బృందం కనుగొంది. భూమిలాంటి గ్రహాలపై వాతావరణంలో నీటి అణువులను గుర్తించడంలో వీరి పరిశోధన ఒక మైలురాయి అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ గ్రహం తన నక్షత్రానికి అతి సమీపం నుంచే చుట్టూ తిరుగుతోందట. నక్షత్రం ముందుగా వెళుతున్నప్పుడు నక్షత్ర కాంతి వర్ణపటంలో కనిపించే తేడాను బట్టి.. దీనిని శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు.

మరిన్ని వార్తలు