'వద్దు.. వద్దు.. మేం విచారిస్తూనే ఉన్నాం'

15 Feb, 2016 17:43 IST|Sakshi
'వద్దు.. వద్దు.. మేం విచారిస్తూనే ఉన్నాం'

నైరోబి: తమ దేశ అథ్లెట్లపై వచ్చిన డోపింగ్ ఆరోపణలపై కెన్యా భద్రతా అధికారులు విచారణ వేగవంతం చేశారు. విచారణ పూర్తై వారు తప్పు చేసినట్లు తేలితే అది దేశానికి చెడ్డ పేరు తెస్తుందని వారు భావిస్తున్నారు. డోపింగ్ మహమ్మారిని అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని గతంలో తాము విధించిన గడువులోగా కెన్యా స్పందించకపోవడంతో ప్రపంచ డోపింగ్ వ్యతిరేక ఏజెన్సీ(వాడా) ఈ కేసును తన స్వతంత్ర క్రమశిక్షణ కమిటీకి బదిలీ చేస్తానని పేర్కొంది.

ఈ నేపథ్యంలో స్పందించిన కెన్యా ఆ అవసరం లేదని, ఇప్పటికే తమ పోలీసులు కీలక ఆధారాలను పరిశీలిస్తున్నారని, త్వరలో అనుమానితులను అరెస్టు చేస్తారని వాడాకు వివరించారు. డోపింగ్ నిజమని తేలితే రష్యా వలె కెన్యాపై కూడా నిషేధం విధించే అవకాశం ఉందని వస్తున్న వార్తలను కొట్టిపారేస్తూ అలా జరగబోదని వాడా తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యవహారం తన క్రమశిక్షణ కమిటీ చేతిలోకి వెళ్లిందని పేర్కొంది. గతంలో కెన్యా అథ్లెట్లు డోపింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.

మరిన్ని వార్తలు