‘కశ్మీర్’ పరిష్కారానికి సిద్ధం: ఐక్యరాజ్యసమితి

10 Dec, 2014 00:52 IST|Sakshi

యునెటైడ్ నేషన్స్: భారత్, పాకిస్తాన్‌లు తమ మధ్య చర్చలను పునరుద్ధరించుకోవాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కీమూన్ సూచించారు. రెండు దేశాలు కోరితే కశ్మీర్ అంశం పరిష్కారానికి వీలుగా సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇదే విషయాన్ని గతంలోనూ చెప్పినట్లు గుర్తు చేశారు. చర్చల ద్వారానే జమ్మూ కశ్మీర్‌లో శాంతి సాధ్యమన్నారు. రెండు దేశాలు చర్చలను తిరిగి మొదలు పెట్టాలని... కశ్మీర్‌పై అంగీకారం కుదిరితే ఇరు దేశాల్లోనూ భద్రతతో పాటు ప్రాంతీయంగా సుస్థిరతకు వీలవుతుందని పీటీఐ వార్తా సంస్థతో మూన్ అన్నారు.

 

మరిన్ని వార్తలు