ఉద్రిక్తతలు తొలగించుకోవాలి: కిర్బీ

7 Oct, 2016 09:47 IST|Sakshi
ఉద్రిక్తతలు తొలగించుకోవాలి: కిర్బీ
వాషింగ్టన్: కశ్మీర్ వివాదం పరిష్కారానికి భారత్, పాకిస్తాన్ రెండు వైపుల నుంచి చొరవచూపాలని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ అభిప్రాయపడ్డారు. ఇరుదేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్తపరిస్థితిని తొలగించుకోవాలని తాము కోరుకుంటున్నామని శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. సమస్య పరిష్కారానికి దేశాల మధ్య అర్థవంతమైన చర్చలు జరగాల్సి ఉందని అన్నారు.
 
యూఎస్ కాంగ్రెస్లో పాకస్తాన్ను టెర్రరిస్టు దేశంగా ప్రకటించే బిల్లు ప్రస్తావన గురించి మాట్లాడుతూ.. అలాంటి ప్రత్యేకమైన బిల్లు ఏదీ తాన దృష్టికి రాలేదని కిర్బీ తెలిపారు.  అదేసమయంలో చట్టసభల్లో తీసుకోబోయే నిర్ణయాలపై తాను కామెంట్ చేయబోనని అన్నారు. పాకిస్తాన్ దగ్గర ఉన్న అణ్వాయుధాలు ఉగ్రవాదుల చేతికి చిక్కే అవకాశాలపై పాత్రికేయుల ప్రశ్నకు సమాధానంగా.. పాక్ ఆయుధసంపత్తికి సంబంధించిన భద్రతా వ్యవహారంపై తాను నమ్మకంగా ఉన్నానని కిర్బీ అన్నారు.
 
>
మరిన్ని వార్తలు