'జైల్లోనే ఛోటా రాజన్ను చంపేస్తాం'

26 Dec, 2015 18:20 IST|Sakshi
'జైల్లోనే ఛోటా రాజన్ను చంపేస్తాం'

మాఫియా డాన్ ఛోటా రాజన్ను తిహార్ జైల్లోనే హతమారుస్తామని మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కుడిభుజం ఛోటా షకీల్ హెచ్చరించాడు. శనివారం దావూద్ 60వ బర్త్ డే సందర్భంగా ఛోటా షకీల్ ఓ జాతీయ వెబ్సైట్కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. దావూద్ బర్త్ డే వేడుకలు, డి గ్యాంగ్ వ్యవహారాలు, ఛోటా రాజన్తో విరోధం తదితర విషయాల గురించి మాట్లాడాడు.

ఛోటా రాజన్ చచ్చిన పాముతో సమానమని ఛోటా షకీల్ అన్నాడు. 'రాజన్ను మేం ప్రత్యర్థిగా భావించడం లేదు. మాకు వ్యతిరేకంగా అతను నిలబడలేడు. ప్రస్తుతం అతడు ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. రాజన్ను తిహార్ జైల్లోనే చంపేస్తాం. అతణ్ని చంపేందుకు గతంలో పలుమార్లు ప్రయత్నించాం. అయితే కొద్దిలో తప్పించుకున్నాడు. ఈ రోజు కాకపోతే రేపయినా రాజన్ను హతమారుస్తాం' అని ఛోటా షకీల్ చెప్పాడు. బాలిలో రాజన్ను అరెస్ట్ చేసిన ఇండోనేసియా పోలీసులు అతణ్ని భారత్కు అప్పగించిన సంగతి తెలిసిందే.


పాకిస్థాన్లో రహస్య జీవితం గడుపుతున్న దావూద్ ఘనంగా బర్త్ డే వేడుకలు చేసుకుంటున్నట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఛోటా షకీల్ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక డి గ్యాంగ్ నుంచి దావూద్ వైదొలిగి మరొకరికి బాధ్యతలు అప్పగించనున్నట్టు వచ్చిన వార్తలు కూడా వాస్తవం కాదని వెల్లడించాడు. 'దావూడ్ భాయ్ ఎప్పటికి రిటైర్ కాడు. ఎప్పటికి అతనే మాకు బాస్. అతడి స్థానాన్ని భర్తీ చేసే సత్తా ఎవరికీ లేదు' అని ఛోటా షకీల్ చెప్పాడు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు