‘ఆ గోడకు పైసా చెల్లించం.. మేం వాటిని నమ్మం’

26 Jan, 2017 16:13 IST|Sakshi
‘ఆ గోడకు పైసా చెల్లించం.. మేం వాటిని నమ్మం’

మెక్సికో: యూఎస్-మెక్సికో మధ్య అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ నిర్మించే గోడకు తాము ఒక్క పైసా కూడా ఇవ్వబోమని మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్‌ పెనానీతో స్పష్టం చేశారు. గోడలకు తాము వ్యతిరేకం అని, మెక్సికోకు ఇరు దేశాల మధ్య అడ్డుగా నిర్మించే గోడలపై అస్సలు నమ్మకం లేదని అన్నారు. గురువారం ఆయన తమ దేశ పౌరులకు సందేశం ఇచ్చే సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..

‘నేను ఇంతకుముందు చెప్పాను మరోసారి స్పష్టంగా చెబుతున్నాను. మెక్సికో ఏ గోడకు కూడా ఎలాంటి డబ్బులు చెల్లించదు. కలిసి ఉండకుండా గత కొంతకాలంగా అమెరికా గోడను నిర్మిస్తూ ఉండటాన్ని దానిని పూర్తి చేస్తానని ట్రంప్‌ ప్రకటించడాన్ని చూసి నేను సిగ్గుగా భావిస్తున్నాను. అమెరికా నిర్ణయాన్ని ఖండిస్తున్నాను. కలిపి ఉంచేలా ప్రయత్నించాల్సి పోయి ఇలాంటి పనులు చేస్తున్నందుకు బాధగా ఉంది’ అని అన్నారు. అయితే, ఈ నెల తన అమెరికా పర్యటన రద్దు చేసుకుంటారా.!కొనసాగిస్తారా! అనే విషయాన్ని మాత్రం ఆయన చెప్పలేదు.

వాషింగ్టన్‌కు ఈ నెల 31న డోనాల్డ్‌ ట్రంప్‌ను ఎన్రిక్‌ కలిసేందుకు వెళ్లనున్నారు. వివాదాస్పద ‘యూఎస్‌- మెక్సికో సరిహద్దు గోడ’ను ఖచ్చితంగా నిర్మిస్తామని ట్రంప్‌ చెప్పడమే కాకుండా ఆ ఫైలుపై బుధవారం సంతకం చేశారు. అంతకుముందు యూఎస్‌- మెక్సికోల మధ్య గోడను కట్టబోతున్నాం’ అని అధ్యక్షుడు ట్రంప్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపిన విషయం తెలిసిందే.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు