వారాంతపు వ్యాయామమైనా చాలు!

11 Jan, 2017 03:18 IST|Sakshi
వారాంతపు వ్యాయామమైనా చాలు!

హూస్టన్‌: వ్యాయామం రోజూ చేయడం సాధ్యపడని వారు కనీసం వారాంతాల్లో చేసినా ఫరవాలేదని ఓ అధ్యయనం చెబుతోంది.  రోజుకు 75 నిమిషాలపాటు కఠోరంగా లేదా 150 నిమిషాలపాటు తేలికైన వ్యాయామాలు చేయాలని వైద్యులు చెబుతుంటారు. తీరికలేని జీవనశైలితో ఇది సాధ్యపడదు. అలాంటివారు కనీసం వారాంతాల్లో బాగా ఎక్కువ సమయాన్ని శారీరక శ్రమ చేయడానికి కేటాయించినా ఆరోగ్యపరంగా మంచి ఫలితాలే ఉంటాయని పరిశోధకులు అంటున్నారు. ఇంగ్లాండ్‌లోని లాఫ్‌బోరఫ్‌ విశ్వవిద్యాలయంలో ఉన్న ‘ఎక్సర్‌సైజ్‌ యాజ్‌ మెడిసిన్‌’ అనే విభాగంలో పరిశోధకుడిగా పనిచేస్తున్న డోనోవన్‌ అనే వ్యక్తి, ఆరోగ్య సర్వేల్లోని 63 వేల మంది వివరాలను పరిశీలించి ఈ విషయం తేల్చాడు.

>
మరిన్ని వార్తలు