ట్రంప్‌ ఇవి తినాల్సిందే..

19 Jan, 2018 11:19 IST|Sakshi

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోగ్యం అద్భుతంగా ఉందని వైట్‌హౌస్‌ వైద్యుడు కితాబిచ్చినా కొలెస్ర్టాల్‌ లెవెల్స్‌పై మాత్రం ఆందోళన వ్యక్తం చేశారు. 71 ఏళ్ల వయసులో 29కి పైగా బీఎంఐ స్కోర్‌ కారణంగా హార్ట్‌ ఎటాక్‌, గుండె సంబంధిత వ్యాధుల బారినపడే రిస్క్‌ నుంచి తప్పించుకునేందుకు ట్రంప్‌కు స్పెషల్‌ డైట్‌ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ట్రంప్‌ శరీరంలో చెడు కొలెస్ర్టాల్‌ లెవెల్స్‌ గత ఏడాది 169 కాగా, ఇప్పుడవి 233కు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దీనికి తోడు ట్రంప్‌కు వేపుళ్లు, డైట్‌ కోక్‌ ఫేవరెట్‌ ఫుడ్‌ కావడంతో ఇక వాటికి ఆయన దూరం కావాలని చెబుతున్నారు.

అధ్యక్షుడు ముందుగా ప్రాసెస్డ్‌ ఫుడ్‌ను పక్కనపెట్టి వైట్‌హౌస్‌ చెఫ్‌తో ప్రత్యేకంగా వండిన ఆహారాన్ని తీసుకోవాలని న్యూయార్క్‌ పర్సనల్‌ ట్రైనింగ్‌ సీఈవో రూలీ చెప్పారు. ఫైబర్‌ నిండిన కూరగాయలు, ఆకు కూరలను ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. ఆహారంలో 25 శాతం మించకుండా కార్బోహైడ్రేట్స్‌ తీసుకోవాలన్నారు. జంక్‌ ఫుడ్‌కు దూరంగా ఉండి ఫైబర్‌ అధికంగా కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని కెనడాకు చెందిన డైటీషియర్‌ అబీ షార్ప్‌ చెప్పారు. ఫైబర్‌ కొలెస్ర్టాల్‌ లెవెల్స్‌ తగ్గిస్తుందన్నారు.

ట్రంప్‌ తన వయసుకు తగ్గట్టు ఆయన రోజుకు కనీసం 30 గ్రాముల ఫైబర్‌ తీసుకోవాలన్నారు. ట్రంప్‌ కోసం బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్‌లకు ప్రత్యామ్నాయ ఆహారాలను ఆమె సూచించారు. బ్రేక్‌ఫాస్ట్‌గా ఓట్స్‌తో చేసిన ఆహారంతో పాటు తాజా పండ్లు తీసుకోవాలన్నారు. లంచ్‌కు క్వినోవా రైస్‌తో పాటు అన్ని కూరగాయలతో చేసిన సలాడ్‌ మేలని సూచించారు. రాత్రి డిన్నర్‌కు సాల్మన్‌ ఫిష్‌తో చేసిన ఆహారం తీసుకోవాలని, వీటిలో ఉండే ఒమేగా-3తోపాటు ఇతర ఫ్యాటీ యాసిడ్స్‌ చెడు కొలెస్ర్టాల్‌ను, ప్రమాదకర ట్రైగిజరైడ్లను తగ్గించడంతో పాటు బీపీని అదుపులో ఉంచుతాయని, గుండె జబ్బుల రిస్క్‌ను నియంత్రిస్తాయని చెప్పారు. వీటికి తోడు ఉదయం,సాయంత్రం నడక వంటి యాక్టివిటీస్‌తో చురుకుగా ఉండాలని సూచించారు.

మరిన్ని వార్తలు