ఆహా! పదేళ్లలో ఎంత మార్పు!

1 Jan, 2020 14:46 IST|Sakshi

2019 నుంచి 2020లోకి అడుగు పెట్టామంటే ఓ కొత్త సంవత్సరంలోకి ప్రవేశించడమే కాదు. కొత్త దశాబ్దంలోకి కూడా ప్రవేశించడం. 2010 సంవత్సరం నాటికి మొదటి దశాబ్దకాలాన్ని పూర్తి చేసుకున్న సోషల్‌ మీడియా 2020 నాటికి రెండో దశాబ్దంలోకి వినూత్న రీతిలో అడుగు పెట్టింది. 2010లో తాము ఎలా ఉన్నారో, ఇప్పుడు ఈ దశాబ్దంలో ఎలా ఉన్నరో తెలియజేసే ఫొటోలను యూజర్లు పోస్ట్‌ చేస్తూ వాటికి సముచిత కామెంట్లను కూడా జోడిస్తున్నారు.

ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లో ‘హౌహార్డ్‌డిడ్‌ఏజ్‌హిట్‌యూ, గ్లోఅప్, టెన్‌ఇయర్‌ఛాలెంజ్‌’ హాష్‌ ట్యాగ్‌లతో తమ అప్పటి, ఇప్పటి ఫొటోలను సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు పోస్ట్‌ చేస్తున్నారు. వారిలో ఎక్కువ మంది ఆరోగ్యం, శరీర సౌష్టవం వల్ల అవగాహన పెంచుకోవడం ద్వారా అప్పటికంటే ఇప్పుడు బలంగా, అందంగా తయారుకాగా, కొంత మంది వయస్సురీత్యా సంక్రమించే వద్ధాప్య లక్షణాలతో కళ తప్పారు. సినీతారలు, కళాకారులు, మోడల్స్‌తోపాటు మోడ్రన్‌ దంపతులు కూడా తమ అప్పటి, ఇప్పటి ఫోటోలను షేర్‌ చేశారు. వారిలో విక్టోరియా బెకమ్‌ నుంచి లిజ్‌హర్లీ, చెరిల్‌ వరకు సెలబ్రిటీలు ఉన్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు