క్రీస్తును ఎలా శిలువ వేశారు?

25 Mar, 2016 15:42 IST|Sakshi

లండన్: నేడు పవిత్ర శుక్రవారం. అంటే ఏసు క్రీస్తును శిలువ వేసిన రోజు. శిలువ వేయడం అంటే శిలువకు క్రీస్తును ఆనించి చేతులకు, కాళ్లకు మేకులు దిగేయడంగా మనకు తెలుసు. ఇప్పుడు మనకు ఏ క్రీస్తు శిలువ విగ్రహాన్ని చూసిన ఇదే అర్థం అవుతుంది. మరి నిజంగా క్రీస్తును శిలువ వేసినప్పుటు ఆయన చేతులకు, కాళ్లకు మేకులు దిగేశారా? అన్నది ఇప్పుడు చర్చ.  చిన్న చిన్న నేరాలు చేసిన వారిని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన వారిని, ప్రజల్లో తిరుగుబాటు లేవదీసిన వారిని శిలువ వేయడం నాటి రోమన్ సంస్కృతి.

శిలువ వేయడం అంటే మరణ శిక్ష వేయడమని కూడా కాదు. కొన్ని రోజుల పాటు అన్న పానీయాలు లేకుండా అలా శిలువపై మాడుస్తారు. హింసిస్తారు. కొందరు ఆ శిక్ష ను తట్టుకోలేక చనిపోతారు. బతికున్న వారిని వదిలేస్తారు. మరి ఏసు క్రీస్తును ఎలా శిలువ వేశారు? రోమన్లు శిలువ వేసినప్పుడు చేతులు, కాళ్లకు మేకులు కొట్టేవారనడానికి ఎక్కడా శాస్త్రీయ లేదా చారిత్రక ఆధారాలు లేవు. పురావస్తు తవ్వకాళ్లో శిలువ శిక్ష అనుభవించిన వారి శకలాలు దొరికాయి. వారి చేతులకు, కాళ్లకు మేకులు కొట్టిన ఆనవాళ్లు దొరకలేదు. ఒకే ఒక్క మానవ శకలం అలా దొరికింది. దానికి కూడా కాళ్లకు మాత్రమే మేకులు దిగేసినట్లు ఉంది. చేతులకు లేవు.

బ్రిటీష్ మ్యూజియంలో ఇప్పటికీ భద్రంగా ఉన్న నాలుగవ శతాబ్దం నాటి క్రీస్తు శిలువ విగ్రహాల్లో క్రీస్తు చేతులు, కాళ్లకు మేకులు కొట్టిన ఆనవాళ్లు లేవు. భుజం మీద అడ్డంగా ఉన్న కర్రకు మణికట్టు వద్ద చేతులు కట్టేసినట్లు మాత్రమే అవి ఉన్నాయి. రత్నపు రాళ్లపై చెక్కిన ఆ విగ్రహాలను జాగ్రత్తగా చూసినట్లయితే ఈ విషయం మనకు అర్థం అవుతుంది.

నాటి కాలం గాస్పెల్స్ (క్రీస్తు జీవితం, ప్రవచనాల ప్రచారకులు) కూడా ఏనాటు క్రీస్తును ఈ విధంగా శిలువ వేశారని చెప్పలేదు. కొత్త టెస్టామెంట్ ప్రకారం మాత్యూ, మార్క్, లూక్, జాన్ అనే గాస్పెల్స్ కొంచెం అటూ ఇటుగా క్రీస్తుకు మేకులు దిగేశారని చెప్పారు. నాటి రోమన్ కాలంలో మనుషులను శిలువ వేసినప్పుడు మేకులు కొట్టేవారు కాదని, చేతులను, కాళ్లను కట్టేసేవారని మనకు ‘మోంటీ పైథాన్స్ లైప్ ఆఫ్ బ్రెయిన్’ హాలివుడ్ పురాతన సినిమా కూడా తెలియజేస్తోంది.

మరిన్ని వార్తలు