కష్టం.. మెదడుకి ఇష్టం

25 May, 2018 03:25 IST|Sakshi

లండన్‌: కలిసుంటే కలదు సుఖం.. కలిసికట్టుగా పనిచేస్తే ఎంతటి కష్టాన్ని అయినా జయించొచ్చు.. ఇలాంటి మాటలన్నీ మన పూర్వీకుల నుంచి వింటున్నవే. అయితే కలిసికట్టుగా కాకుండా ఎంతటి విపత్కరమైన పరిస్థితినైనా కష్టపడి ఎదుర్కోవడమే మనిషి మెదడుకి మంచిదని శాస్త్రవేత్తలు అంటున్నారు. క్లిష్ట పరిస్థితులను సొంతంగా ఎదుర్కోవడం ద్వారా మనిషి మెదడు పరిమాణం పెరుగుతుందని బ్రిటన్‌ లోని సెయింట్‌ ఆండ్రూస్‌ యూనివర్సిటీ పరిశోధకులు తాజా అధ్యయనంలో కనుగొన్నారు.

కలిసికట్టుగా సమస్యలను ఎదుర్కునే వ్యక్తులు తమ మేధస్సును పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేరని.. దీంతో మెదడు పరిమాణం చిన్నదిగా మారుతుందని వారు గుర్తించారు. మన పూర్వీకులు కూడా కలిసి కట్టుగా సమస్యలను ఎదుర్కొనేవారు.. దీంతో వాళ్ల మెదళ్లు పూర్తి స్థాయిలో వికసించలేదని వివరించారు. భవిష్యత్తులో ఎదుర్కోబోయే సామాజిక సమస్యలకు అనుగుణంగా మానవ మెదడు పరిమాణం పెరుగుతూ వస్తోందని సోషల్‌ బ్రెయిన్‌ హైపోథిసిస్‌ అధ్యయనం చెబుతోంది. అయితే ప్రస్తుత అధ్యయనం వీటన్నింటినీ ఖండించింది.

మరిన్ని వార్తలు