వాట్సాప్‌లో ఎర్రర్ : యూజర్లు గగ్గోలు

20 Jun, 2020 09:14 IST|Sakshi
ఫైల్ ఫోటో

సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో తలెత్తిన సమస్య ప్రపంచవ్యాప్తంగా యూజర్లను గందరగోళంలోకి నెట్టేసింది. ఫేస్‌బుక్ సొంతమైన వాట్సాప్‌లో సెక్యూరిటీ సెట్టింగ్ లో వినియోగదారుల లాస్ట్ సీన్, టైపింగ్, ఆన్‌లైన్‌లో ఉన్న సంకేతాలను చూడలేక పోవడంతో కలకలం రేగింది. దీంతో చాలామంది వినియోగదారులు ట్విటర్ లో స్క్రీన్‌షాట్‌లను షేర్ చేస్తూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరికొందరు మీమ్స్ తో సందడి చేశారు. (గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింది : క్యాష్‌బ్యాక్ కూడా)

డౌన్ డిటెక్టర్ అందించిన సమాచారం ప్రకారం వాట్సాప్ యూజర్లు అప్లికేషన్ గోప్యతా సెట్టింగులలో ఒక బగ్ కారణంగా సాంకేతిక సమస్య ఉత్పన్నమైంది. దీంతో తమ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ లేదా ఐఫోన్‌లో లాస్ట్ సీన్ సెట్టింగ్‌ను మార్చడంలో 67 శాతం వినియోగదారులు, 26 శాతం వినియోగదారులు కనెక్షన్ సమస్య, 6 శాతం మందికి లాగిన్ ఇబ్బందులొచ్చాయని ఫిర్యాదు చేశారు. ఇండియా సహా, అమెరికా, యుకె, యూరప్, సింగపూర్ లోని కొన్ని ప్రాంతాల్లోని వినియోగదారులను ఈ సమస్య ప్రభావితం చేసిందని డౌన్ డిటెక్టర్ పేర్కొంది. అయితే ఈ విషయంపై ఫేస్‌బుక్ లేదా వాట్సాప్ ఇప్పటివరకు స్పందించలేదు. (కంపెనీ పాల‌సీకి విరుద్దం అంటూ ప్ర‌క‌ట‌న‌)

మరిన్ని వార్తలు