విండోస్ డెస్క్‌టాప్‌లోనూ వాట్సాప్

12 May, 2016 20:22 IST|Sakshi
విండోస్ డెస్క్‌టాప్‌లోనూ వాట్సాప్

న్యూయార్క్: వాట్సాప్ అంటే ఇప్పటిదాకా మొబైల్ ఫోన్లకే పరిమితం. ఇకపై విండోస్, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే డెస్క్‌టాప్‌లోనూ వాట్సాప్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది ఫేస్‌బుక్. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించింది. విండోస్, మ్యాక్ డెస్క్‌టాప్‌లో ఏ బ్రౌజర్‌ను ఉపయోగిస్తున్నప్పటికీ ఈ యాప్‌తో వాట్సాప్ ద్వారా సందేశాలను పంపుకోవచ్చు. విండోస్ 8, ఆపై ఓఎస్‌లకు మాత్రమే ఈ యాప్ పనిచేస్తుంది.

మ్యాక్ 10.9, ఆపై ఓఎస్ వినియోగదారులు మాత్రమే దీనిని వినియోగించుకోవచ్చు. యాప్‌ను ఓపెన్ చేసి, అందులో కనిపించే క్యూఆర్ కోడ్‌ను మన స్మార్ట్‌ఫోన్ ద్వారా స్కాన్ చేస్తే చాలు ఆటోమేటిక్‌గా డెస్క్‌టాప్‌పై వాట్స్‌యాప్ దర్శనమిస్తుంది. ఎంచక్కా మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు పంపుకోవడమే.
 

మరిన్ని వార్తలు