పొద్దున లేస్తే అదే పని

10 Nov, 2015 11:01 IST|Sakshi
పొద్దున లేస్తే అదే పని

న్యూఢిల్లీ: గతంలో పొద్దున్నే లేవగానే హా... అంటూ కళ్లు తుడుముకునే వారంతా ఇప్పుడు మాత్రం నిద్రనుంచి మేల్కొంటుండగా కళ్లు తెరవకుండానే ముందు వారి చేతులు ముందు స్మార్ట్ ఫోన్ను వెతుకుతున్నాయట. అలా తీసుకునేది టైం ఎంతయిందో చూసుకోవడానికి కాదండోయ్.. వెంటనే డేటా ఆన్ చేసి వాట్సాప్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో పడిపోతుంటారట. డెలాయిట్ లోని ఓ ప్రొఫెషనల్ సర్వీస్ సంస్థ ఈ మేరకు అధ్యయనం చేసి దాని వివరాలు తెలిపింది.

డెలాయిట్ మొబైల్ వినియోగదారుల సర్వే 2015 ప్రకారం స్మార్ట్‌ ఫోన్ ఉపయోగిస్తున్న 78 శాతం మంది కూడా నిద్ర నుంచి మేల్కొండగా, మేల్కొన్న తర్వాత కనీసం పదిహేను నిమిషాల్లోనే కచ్చితంగా సోషల్ మీడియాలోకి ప్రవేశిస్తారని తెలిపింది. మరో 52శాతంమంది మాత్రం నిద్రలోకి జారుకునే ముందు ఓ ఐదు నిమిషాలపాటు అందులో విహరిస్తారని తెలిపింది. ఇలా వారు చెక్ చేసే సామాజిక మాధ్యమాల్లో వాట్సాప్, ఫేస్ బుక్, చాట్ బాక్సెస్, మెయిల్స్ వాటిని ఎక్కువగా తనిఖీ చేస్తుంటారని కూడా ఆ అధ్యయనం వెల్లడించింది.

మరిన్ని వార్తలు