వాట్సాప్‌ మరో అద్భుతమైన అప్‌డేట్‌

4 Oct, 2019 08:33 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలోనే తన యూజర్లకు మరో అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. వాట్సాప్‌లో మన పంపించే మెసేజ్‌లో వాటంతట అవే డిలీట్‌ అయ్యేలా ఒక కొత్త  ఆప్షన్‌ను పరిశీలిస్తోంది. ఇప్పటికే మనం పంపిన మెసేజ్‌ను ఒక నిర్ణీత సమయంలోపు డిలీట్ చేసుకునే సౌలభ్యం అందిస్తున్న విషయం విదితమే. అయితే ఇకపై ఈ మెసేజ్‌లు నిర్ణీత సమయం (5సెకన్ల నుంచి 1 గంట) వరకు మాత్రమే కనిపించి ఆ తరువాత వాటంతట అవే ఆటోమేటిగ్గా అదృశ్యమైపోయేలా చేయవచ్చు. అందుకుగాను వాట్సాప్‌ సెట్టింగ్స్ విభాగంలో అందజేసే ‘డిజప్పియరింగ్ మెసేజెస్’ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. వా బేటా అందించిన సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ ఫీచర్‌ను పరీక్షిస్తోంది. 

అంటే ఏదైనా  సెన్సిటివ్‌  మెసేజ్‌ను పంపించాక, అది ఎక్కువ సేపు ఉండకూడదని భావిస్తే..డిజప్పియర్డ్‌ మెసేజెస్‌ లోకి వెళ్లి, ఆఫ్‌, 5 సెకండ్స్‌, గంట అనే అప్షన్‌ను ఎంచుకోవాలి. ఇది గ్రూపు చాటింగ్‌లో గానీ, వ్యక్తిగత చాటింగ్‌లో గానీ ఈ ఆప్షన్‌ను వినియోగించుకోవచ్చు.  ఒక్కసారి డిలీట్‌ అయిన తరువాత ఇవి చాట్‌లో ట్రాక్‌లో కూడా అందుబాటులో ఉండవు. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉండగా.. త్వరలోనే వాట్సాప్ యూజర్లందరికి అందుబాటులోకి తేనుంది. ఇటీవల వాట్సాప్‌ స్టేటస్‌ స్టోరీలను డైరెక్టుగా ఫేస్‌బుక్‌ స్టోరీలో షేర్‌ చేసుకునే అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. అయితేతాజా అప్‌డేట్‌పై  వాట్సాప్‌ అధికారికంగా  ప్రకటన చేయాల్సి వుంది.

చదవండి : వాట్సాప్‌ అప్‌డేట్‌

మరిన్ని వార్తలు