ఆ రోజు వాట్సాప్‌లో ఎన్ని మెసేజ్‌లు పంపుకున్నారో తెలుసా.?

4 Jan, 2018 22:05 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యధిక మంది యూజర్లు వాడుతున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌గా వాట్సాప్. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 7500 కోట్లు మెస్సేజ్‌లు. గత నెల 31న మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 11.59 గంటల వరకు న్యూ ఇయర్ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా వాట్సప్‌ యూజర్లు పంపిన సందేశాల సంఖ్య ఇది. ఈ విషయాన్ని వాట్సప్‌ తాజాగా వెల్లడించింది.  ప్రపంచంలో అత్యధిక మంది యూజర్లు వాడుతున్న ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌గా వాట్సప్‌ నిలిచిన విషయం తెలిసిందే.

అంతేకాదు మెస్సేజ్‌లకు తోడు 1,300 కోట్ల ఇమేజ్‌లు, 500 కోట్ల వీడియోలను న్యూ ఇయర్‌ సందర్భంగా వాట్సప్‌ యూజర్లు పంపుకున్నారు. అయితే డిసెంబర్‌ 31 అర్ధరాత్రి తరువాత వాట్సప్‌ కొంత సేపు పనిచేయలేదు. ఆ యాప్‌ను పెద్ద ఎత్తున యూజర్లు వాడడంతో క్రాష్‌ అయింది. కానీ సమస్యను త్వరగా చక్కదిద్దారు. దీంతో మళ్లీ వాట్సప్‌ సేవలు యదావిధిగా నడిచాయి. ఇందులో ప్రస్తుతం రోజుకు 100 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉంటున్నారు. 

మరిన్ని వార్తలు