వాట్సాప్‌లో జాగ్రత్త!

6 May, 2018 14:26 IST|Sakshi

సాక్షి, ముంబై: లక్కీ డ్రాలు, బహుమతులు గెలుచున్నట్లు వచ్చే స్పామ్‌ ఈమెయిల్స్‌ గురించి తెలిసిందే. ఇప్పుడు స్మార్ట్‌ ఫోన్లు వచ్చాక అది మరీ ఎక్కువైపోవటంతో దాదాపు అందరికీ దానిపై అవగాహన ఉండే ఉంటుంది. సోషల్‌ మీడియా మాధ్యమాలైన వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లకు కూడా ఈ తరహా సందేశాల తాకిడి ఎక్కువైపోయింది. అయితే తాజాగా వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్న ఓ సందేశం గురించి నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

‘డోంట్‌ టచ్‌ మీ హియర్, డొంట్‌ టచ్‌ ఇట్‌‌’ పేరిట ఈ మధ్య ఓ సందేశం తెగ చక్కర్లు కొడుతోంది. మీ వాట్సాప్‌ హ్యాంగ్‌ అయిపోతుందంటూ తొలుత ఓ మెసేజ్‌ వస్తుంది. ఆ వెంటనే చిన్న బాల్‌ తరహా గుర్తుతో మరో సందేశం వస్తుంది. అది క్లిక్‌ చేస్తే గనుక సంజ్ఞలతో కూడిన మరో సందేశం వచ్చి ఫోన్‌ హ్యాంగ్‌ అయిపోతుంది. ఈ వ్యవహారంపై వాట్సాప్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘ఏదో జోక్‌గా పంపారనుకుంటే అది పొరపాటే. అదొక వైరస్‌. కోడ్‌ను ఆటోమేటిక్‌గా డౌన్‌ లోడ్‌ చేసుకుని మీ వాట్సాప్‌ను(యాప్‌ను) నాశనం చేస్తుంది. ఫోన్‌ డేటాపై కూడా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దానిని క్లిక్‌ చేయకపోవటమే మంచిది’ అంటూ వాట్సాప్‌ ఓ ప్రకటన విడుదల చేసింది.

మరిన్ని వార్తలు