ఎదగడానికెందుకురా తొందర..

21 Sep, 2014 00:27 IST|Sakshi
ఎదగడానికెందుకురా తొందర..

ఈ పాట మనోడు విన్నట్లు లేడు.. రోజురోజుకూ రేవులో తాటిచెట్టులా బారుగా ఎదిగిపోతున్నాడు. వీడి పేరు కరణ్ సింగ్. వయసు కేవలం 5 ఏళ్లే. వీడి పక్కన  మరుగుజ్జుల్లా కనిపిస్తున్న వాళ్లు కరణ్‌సింగ్ క్లాస్‌మేట్స్. మామూలుగా కరణ్ వీళ్ల సైజులోనే ఉండాలి. కానీ ఇంతున్నాడు. కరణ్ మామూలోడు కాడు. పుట్టినప్పుడే గిన్నిస్ రికార్డు కొట్టాడు.

2008లో వీడు పుట్టినప్పుడు 7 కిలోల బరువు, 2 అడుగుల కన్నా ఎక్కువ ఎత్తున్నాడట. దీంతో అప్పట్లో అత్యంత పొడవైన, బరువైన శిశువు కింద గిన్నిస్ బుక్‌లోకి ఎక్కాడు. మళ్లీ గిన్నిస్ వాళ్లు టేపు పట్టుకుని లెక్కేస్తే..  ప్రస్తుతం ప్రపంచంలో 5 ఏళ్ల వయసున్న పిల్లల్లో కరణే అందరికన్నా ఎక్కువ ఎత్తు ఉంటాడట. వీళ్లింట్లో కూడా అందరూ బాగా హైట్ ఉన్నవారే. కరణ్ తండ్రి సంజయ్ సింగ్ ఎత్తు 6 అడుగుల 6 అంగుళాలు అయితే.. వాళ్లమ్మ స్వెత్లానా హైట్ 7 అడుగుల 2 అంగుళాలు.  
 
 

మరిన్ని వార్తలు