ఆ దేశాల్లోనే ‘ఫ్రెంచ్‌ ముద్దులు’ ఎక్కువ

29 Feb, 2020 18:53 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం (కర్టసీ: డెయిలీ మెయిల్‌)

న్యూఢిల్లీ : ‘ముద్దంటే చేదా నీకు, ఆ ఉద్దేశం లేదా నీకు!’ అంటూ ఆ దేశాల్లో ఎవరు, ఎవరిని అడకక్కర్లేదు. అడక్కుండానే అక్కడ ప్రేమికులు, భార్యా భర్తలు కలసుకున్నదే తడవుగా ‘ఫ్రెంచి కిస్‌’లు పెట్టుకుంటారు. దాన్నే మన సినిమా పరిభాషలో ‘లిప్‌ లాక్‌’ ముద్దులంటాం. ధనవంతుడికి పేద వాడికి మధ్య అత్యంత ఎక్కువ వ్యత్యాసాలున్న ఆరు ఖండాల్లోని 13 ఎంపిక చేసిన దేశాల్లో ‘ముద్దు’ ముచ్చటపై స్కాట్‌లాండ్‌లోని ఆల్బర్టీ యూనివర్శిటీ పరిశోధన బృందం అధ్యయనం జరిపింది. (చదవండి: పెంపుడు కుక్క పిల్లకూ కోవిడ్‌ వైరస్‌)

మిగతా దేశాలకన్నా ఆర్థిక వ్యత్యాసాలు ఎక్కువగా ఉన్న ఈ దేశాల్లోనే  ప్రేయసీ ప్రేమికులు, భార్యా భర్తలు నాలుకకు నాలిక, పెదాలకు పెదాలు కలిపి గాఢ చుంభనంలో మునిగిపోతున్నారట. ప్రేమ, ఆప్యాయతల వ్యక్తీకరణకు, శృంగార ఆస్వాదనకు ఇంతకుమించిన మార్గం లేదని వారు వాదిస్తున్నారు. ముద్దే అసలైన శృంగారమని, ముద్దులేని సెక్స్‌ కూడా శృంగారం కాదని వారు వాదిస్తున్నారట. మగవారితో పోలిస్తే ఈ ముద్దులను ఎక్కువగా మహిళలే ఆస్వాదిస్తున్నారట. ముద్దూ ముచ్చట విషయంలో ఆర్థిక వ్యత్యాసాలు ఎక్కువున్న దేశాల్లోనే ఎందుకు ఆదరణ ఎక్కువగా ఉందో, అందుకు సంబంధించి ఆర్థిక, సామాజిక కారణాలపై ఇంకా అధ్యయనం చేయాల్సి ఉందని పరిశోధన బృందానికి నాయకత్వం వహించిన డాక్టర్‌ క్రిస్టఫర్‌ వాట్‌కిన్స్‌ మీడియాకు తెలిపారు. మరిన్ని అధ్యయన వివరాలతో ప్రజల ముందుకు వస్తామని, అప్పుడే తాము అధ్యయనం జరిపిన 13 దేశాల పేర్లను బహిర్గతం చేస్తామని ఆయన చెప్పారు.

యువతీ యువకులు పది సెకన్ల పాటు ఫ్రెంచి ముద్దు పెట్టుకుంటే ఒకరి నుంచి ఒకరికి ఎనిమిది కోట్ల బ్యాక్టీరియా ఒకరి నోట్లో నుంచి ఒకరి నోట్లోకు పోతుందని డచ్‌ జీవ శాస్త్రవేత్తలు ఇప్పటికే తెలియజేశారు. ప్రతి మనిషిలో సహజంగా కొన్ని లక్షల కోట్ల బ్యాక్టీరియా ఉంటుందనే విషయం తెల్సిందే. మరో రకంగా చెప్పాలంటే ఓ మనిషి బరువులో 30 శాతం బరువును ఈ బ్యాక్టీరియానే ఆక్రమిస్తుంది. చెడు బ్యాక్టీరియాతో పాటు మంచి బ్యాక్టీరియా కూడా ఉండడం వల్లనే మనుషులు మనుగడ సాగిస్తున్నారన్న విషయం కూడా తెల్సిందే.

దంపతులు పది సెకడ్ల పాటు ముద్దు పెట్టుకుంటే ఒకరి నుంచి ఒకరిలోకి 8 కోట్ల బ్యాక్టీరియా వెళ్లినప్పుడు అది మంచిదా, కాదా? అన్న ప్రశ్న తలెత్తక మానదు. దంపతుల్లో ఒకరు అనారోగ్య వంతులైతే రెండోవారికి బ్యాక్టీరియా మార్పిడి వల్ల నష్టం జరుగుతుందని కొంత మంది శాస్త్రవేత్తలు అభిప్రాయపడగా, ఆరోగ్యవంతుల నుంచి అనారోగ్యవంతులకు బ్యాక్టీరియా చేరడం వల్ల అవతలి వారిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వాదిస్తోన్న శాస్త్రవేత్తలు లేకపోలేదు. ఏదేమైనా ముద్దుల్లో బ్యాక్టీరియా ప్రభావంపై ప్రపంచంలో ఇప్పటి వరకు ఎలాంటి పరిశోధన జరగలేదని, అవసరమైతే ఇప్పుడు జరపొచ్చని ‘నెదర్లాండ్స్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ అప్లైడ్‌ సైంటిఫిక్‌ రిసర్చ్‌’ పరిశోధకులు డాక్టర్‌ రెమ్‌కో కోర్ట్‌ తెలియజేస్తున్నారు. (చదవండి: కామ పిశాచి.. సవతి కూతురిని దాచేసి)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు