హైహీల్ తో భర్తను కొట్టి చంపిన భార్య

1 Apr, 2014 12:12 IST|Sakshi
హైహీల్ తో భర్తను కొట్టి చంపిన భార్య

ఆయన మరీ మెతక... ఈమె చాలా ముతక. ఆయన పెట్టమారి మగడు. ఈమెది పట్టరాని కోపం. అయ్యగారి పేరు  ఆల్ఫ్ స్టీఫాన్ అండర్సన్. అమ్మగారి పేరు అనా ట్రుజిల్లో. ఇద్దరూ కలిసి జీవిస్తున్నారు. కానీ వాళ్లది కలహాల కాపురం.


ఓ రోజు ఉన్నట్టుండి ట్రుజిలోకి ఆండర్సన్ మీద కోపం వచ్చింది. అంతే అతడిని ఎడాపెడా బాదింది. అయినా ఆమె కోపం చల్లారలేదు. అతడిని ఎత్తి కుదేసి, ఛాతీ మీద కూచుని, తన పాయింటెడ్ హై హీల్ షూతో ముఖం మీద బాదేసింది. మొనదేలిఉన్న హీల్ ముఖమంతా గుర్చుకుని రక్తం కారిపోయింది. చివరికి గాయాల వల్ల అతను చనిపోయాడు. అతని ముఖంపై 25 గాయాలున్నాయి. ఇప్పుడు ట్రుజిల్లో పై కేసు నమోదైంది.


లక్ష డాలర్లు ధరావత్తుగా చెల్లించి ఆమె బెయిల్ పొందారు. 'అతనే నాపై దాడి చేశాడు. నేను అందుబాటులో ఉన్న ఏకైక ఆయుధంతో ఆత్మరక్షణ చేసుకున్నానంతే.' అంటోంది ట్రుజిల్లో అమాయకంగా మొఖంపెట్టి. అమెరికా లోని హౌస్టన్ లో ఈ సంఘటన జరిగింది.

మరిన్ని వార్తలు