అసాంజేకు 50 వారాల జైలు

2 May, 2019 04:27 IST|Sakshi

బ్రిటన్‌ కోర్టు తీర్పు

లండన్‌: వికీలీక్స్‌ సహవ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజే(47)కు బ్రిటన్‌ కోర్టు జైలు శిక్ష విధించింది. బెయిల్‌ నిబంధనలు ఉల్లంఘించిన నేరానికిగాను ఆయనకు 50 వారాల జైలు శిక్ష పడింది. స్వీడన్‌ మహిళ లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో బ్రిటన్‌ కోర్టు నుంచి బెయిల్‌ పొందిన అసాంజే 2012 నుంచి లండన్‌లోని ఈక్వెడార్‌ రాయబార కార్యాలయంలో తలదాచుకున్నారు. అసాంజేకు ఇచ్చిన దౌత్యపరమైన వెసులుబాటును ఈక్వెడార్‌ ప్రభుత్వం ఉపసంహరించుకోడంతో గత నెలలో బ్రిటన్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుపై బుధవారం సౌత్‌వార్క్‌ క్రౌన్‌ కోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న జడ్జి డెబొరా టేలర్‌ అసాంజేకు 50 వారాల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.

మరిన్ని వార్తలు