రష్యా 'బైకాల్'కు పెను ముప్పు

4 Sep, 2015 11:33 IST|Sakshi
రష్యా 'బైకాల్'కు పెను ముప్పు

మాస్కో: రష్యా అడవుల్లో అంటుకున్న కార్చిచ్చు ఆ దేశ సహజ ప్రకృతిపై పెను ప్రభావాన్ని చూపిస్తోంది. ముఖ్యంగా ఆ దేశంలో సహజ సిద్ధంగా ఏర్పడిన అతిపెద్ద మంచినీటి సరస్సు బైకాల్ ఇప్పుడు ఈ అగ్ని ప్రమాదం బారిన పడనుంది. అయినప్పటికీ రష్యా ప్రభుత్వం యంత్రాంగం అలసటత్వం వహించడంపట్ల అక్కడి పర్యావరణ వేత్తలే కాకుండా సామాన్య ప్రజానీకానికి కూడా ఆగ్రహం తెప్పిస్తోంది. ఇటీవల రష్యా అడవుల్లో కార్చిచ్చు రగిలింది. వేల హెక్టార్లలో రోజూ బూడిదవుతోంది. రోజురోజుకూ అదికాస్త ఎక్కువవుతోంది. దీనిని నియంత్రించేందుకు రష్యా ప్రభుత్వం కేవలం అరకొరగా మాత్రమే ప్రయత్నిస్తోంది.

అదీకాకుండా ఈ కార్చిచ్చు వల్ల వెలువడుతోన్న టాక్సిక్ వాయువులకు భయపడి ఆ చుట్టుపక్కల ప్రాంతాలవారు తమ నివాసాలనకు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. పలువురికి ఇప్పటికే అనారోగ్య సమస్యలు కూడా మొదలయ్యాయి. పది వేలమంది యువకులకు, 2,500మంది చిన్నారులకు వైద్యులు పరీక్షలు కూడా నిర్వహించారు. బైకాల్ సరస్సు ప్రపంచంలోనే అతి లోతైన మంచినీటి సరస్సు. దీని ఆధారం చేసుకొని పలు ఆవాసాలు ఏర్పడటమే కాకుండా చక్కటి వన్యసంపద, మృగ సంపద ఏర్పడింది. ప్రస్తుతం కార్చిచ్చువల్ల ఆ సంపదకు ముప్పు వాటిల్ల నుంది.
 

మరిన్ని వార్తలు