ఉచితంగా వెంటిలేటర్లు :  ట్రంప్ కీలక ప్రకటన

16 May, 2020 08:58 IST|Sakshi

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.  కరోనా వైరస్ పై పోరులో భాగంగా  భారతదేశానికి వెంటిలేటర్లను విరాళంగా ఇస్తామని వెల్లడించారు. భారత ప్రధనమంత్రి నరేంద్ర మోదీ తనకు మంచి స్నేహితుడని చెప్పుకొచ్చిన ట్రంప్, భారతదేశంలోని తమ  స్నేహితులకు  వెంటిలేటర్లను విరాళంగా ఇస్తుందని ప్రకటించడం గర్వంగా ఉందని  శుక్రవారం ట్వీట్ చేశారు.  

వైట్ హౌస్ రోజ్ గార్డెన్లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్ వ్యాక్సిన్ అభివృద్ధిలో అమెరికా, భారతదేశం కలిసి పనిచేస్తున్నాయనీ , కరోనా సంక్షోభ సమయంలో మోదీకి తమ మద్దతు వుంటుందని ప్రకటించారు. ఇరువురం కలిసి అదృశ్య శత్రువు కరోనాను ఓడిస్తామని పేర్కొన్నారు. అలాగే కరోనావైరస్ వ్యాక్సిన్ అభివృద్ధిలో సహకరిస్తున్న భారతీయ-అమెరికన్లను "గొప్ప" శాస్త్రవేత్తలు, పరిశోధకులుగా ట్రంప్  అభివర్ణించారు. ఈ ఏడాది చివరి నాటికి కోవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ అభివృద్ధి ప్రయత్నాలకు  మాజీ టీకాల హెడ్‌ను గ్లాక్సో స్మిత్‌క్లైన్‌ నియమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. (మూడ్ లేదు.. ఇక తెగతెంపులే)

విలేకరుల సమావేశంలో వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కైలీ మెక్‌నానీ మాట్లాడుతూ, భారతదేశం కొంతకాలంగా తమ గొప్ప భాగస్వామిగా ఉందనీ, వెంటిలేటర్లను పొందే అనేక దేశాలలో భారతదేశం కూడా ఒకటి ఉంటుందని ఆమె అన్నారు. కాగా దేశంలో కోవిడ్-19 కేసులు క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం కేసుల సంఖ్య 85,940గా వుంది.  తద్వారా చైనాను అధిగమించిన సంగతి తెలిసిందే.  (గుడ్‌ న్యూస్‌: జియో అదిరిపోయే ప్లాన్‌)

చదవండి : వారికి భారీ ఊరట : వేతనాల పెంపు
భారత్‌కు మరోసారి ప్రపంచ బ్యాంకు భారీ సాయం

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు