‘చైనా మమ్మల్నే లేపేద్దామనుకుంటే ఊరుకోం..’

16 Feb, 2018 16:46 IST|Sakshi
సుసాన్‌ థార్న్‌టన్‌, ట్రంప్‌ పాలన వర్గంలో సీనియర్‌ అధికారి

న్యూయార్క్‌ : ఆసియా దేశాల నుంచి తమనే లేకుండా చేయాలనుకుంటే సహించేది లేదని అమెరికా స్పష్టం చేసింది. ఆసియా దేశాలపై చైనా పెత్తనాన్ని తాము అంగీకరించబోమని పేర్కొంది. తన బలాన్ని, ఉద్దేశాలను బలవంతంగా ఆసియా దేశాలపై చైనా ప్రదర్శించడాన్ని తాము వ్యతిరేకిస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పాలన వర్గంలోని ఓ సీనియర్‌ అధికారి చెప్పారు. ట్రంప్‌ పాలన వర్గం చైనాతో ఉత్పాదక సంబంధాలను కోరుకుంటుందని, వివిధ సమస్యల పరిష్కారంపై, నిర్వహణలపై తాము కలిసి పనిచేయాలనుకుంటున్నామని ట్రంప్‌ సీనియర్‌ అధికారి సుసాన్‌ థార్న్‌టన్‌ తెలిపారు.

ఆసియా నుంచి తమను పూర్తిగా పక్కన పెట్టాలని చైనా భావిస్తే ఆ విషయాన్ని తాము అంత తేలికగా పక్కన పెట్టబోమని, సీరియస్‌గానే తీసుకుంటామని చెప్పారు. తమ దేశాన్ని పక్కన పెట్టించే ఉద్దేశంతో ఆసియాలోని దేశాలను చైనా ఒత్తిడి చేయాలని భావించినా తాము అంగీకరించబోమని, ఆ విషయాన్ని అస్సలు సహించబోమని అన్నారు. మరింత ఎత్తుకు ఎదగడానికి అంతర్జాతీయ సమాజం అంగీకరించినా నిబంధనలు, విలువలను చైనా మర్చిపోకూడదని, వీటిని దృష్టిలో పెట్టుకొనే ఆ దేశం ముందుకెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు