‘వింబుల్డన్‌’కు వెయ్యి కోట్ల బీమా సొమ్ము

9 Apr, 2020 14:38 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రానున్న జూన్‌లో జరగాల్సిన వింబుల్డన్‌ టెన్నీస్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీలు కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా వాయిదా పడిన విషయం తెల్సిందే. ఇందుకుగాను భీమా సౌకర్యం కింద ఈ పోటీలను నిర్వహించే ఆల్‌ ఇంగ్లండ్‌ క్లబ్‌కు 114 మిలియన్‌ పౌండ్ల (దాదాపు 1,079 కోట్ల రూపాయలు) సొమ్ము అందనుంది. వాస్తవానికి ఆ క్లబ్‌ పోటీలను నిర్వహించినట్లయితే 250 మిలియన్‌ డాలర్లు (దాదాపు 23,100 కోట్ల రూపాయలు) వచ్చేవి. ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టడంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని క్రీడా పోటీలను రద్దు చేస్తూ వస్తున్నారు. ప్రతిష్టాకరమైన ఒలింపిక్స్‌ పోటీలను కూడా రద్దు చేశారు. 

రెండో ప్రపంచ యుద్ధానంతరం వింబుల్డన్‌ పోటీలను రద్దు చేయడం ఇదే మొదటి సారి. 2003లో సార్స్‌ వచ్చినప్పుడు వింబుల్డన్‌ పోటీలకు భీమా తీసుకున్నారు. అప్పటి నుంచి ప్రతి ఏటా జీవిత భీమా కింద 1.6 మిలియన్‌ పౌండ్లు ప్రీమియం కింద చెల్లిస్తూ వస్తున్నారు. భీమా తీసుకున్నాక 15 ఏళ్ల తర్వాత మొదటి సారి వింబుల్డన్‌ పోటీలు వాయిదా పడ్డాయి. 

మరిన్ని వార్తలు