భర్త లేకుండా బయటకు వచ్చిందని..

28 Dec, 2016 19:15 IST|Sakshi
భర్త లేకుండా బయటకు వచ్చిందని..

కాబుల్: మహిళలపై తాలిబన్ల అఘాయిత్యాలు అఫ్గనిస్తాన్లో పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా భర్త లేకుండా తమ గ్రామంలోకి ప్రవేశించిన ఓ మహిళను తాలిబన్లు అతికిరాతకంగా చంపారు. ఏకంగా మహిళ తలను మొండెం నుంచి వేరు చేసి తమ కర్కషత్వాన్ని బయటపెట్టుకున్నారు. ఈ సంఘటన సర్ ఈ పుల్ ప్రావిన్స్లోని తాలిబన్ల పాలనలో ఉన్న లట్టి గ్రామంలో చోటు చేసుకుంది.   


భర్త ఇరాన్లో ఉండటంతో మార్కెట్లో షాపింగ్ చేయడానికి లట్టి గ్రామానికి బాధిత మహిళ వచ్చిందని సర్ ఈ పుల్ ప్రావిన్స్ గవర్నర్ కార్యాలయం తెలిపింది.  భర్త లేకుండా వచ్చినందుకు గానూ ఆమెను తాలిబన్లు హత్య చేసినట్టు పేర్కొంది.  

తమ పాలనలో ఉన్న ప్రాంతాల్లో ఇస్లాం పేరుతో నిబంధనలను తాలిబన్లు అత్యంత కఠినంగా అమలు చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, పురుషుల సహాయం లేకుండా ఇంట్లో నుంచి బయటకు రావడం నిషేధం. చదువు, ఉద్యోగాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. బురఖా తప్పని సరిగా ధరించాలి.  

ఇటీవలే భద్రతాదళాల్లో పని చేస్తున్న ఐదుగురు మహిళలు ఉద్యోగానికి వేళ్తుండగా తాలిబన్లు తుపాకులతో కాల్చి చంపారు. 2001లో తాలిబన్ల ప్రాబల్యం తగ్గినప్పటినుంచి మహిళల హక్కుల కోసం పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి.విద్యా, ఉపాధిలో అఫ్గన్ మహిళలు కొంత మేర విజయం సాధించినా తాలిబన్ల ఆగడాలు మాత్రం ఆగడం లేదు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గూగుల్‌కు ఊహించని షాక్‌

9మందిని విడుదల చేసిన ఇరాన్‌

అమెరికాలో మళ్లీ మరణశిక్షలు

విషమం : సాయం చేసి ప్రాణాలు నిలపండి..!

కిమ్‌.. మరో సంచలనం

బ్రిటన్‌ హోం మంత్రిగా ప్రీతీ పటేల్‌

చైనా నేవీకి నిధులు, వనరుల మళ్లింపు

చైనా సాయంతో మేము సైతం : పాక్‌!

డల్లాస్‌లో కనువిందుగా ఆహా! ఈహీ! ఓహో!

‘వరల్డ్‌కప్‌తో తిరిగొచ్చినంత ఆనందంగా ఉంది’

వేసవి కోసం ‘ఫ్యాన్‌ జాకెట్లు’

బోరిస్‌ టాప్‌ టీంలో ముగ్గురు మనోళ్లే

జాబిల్లిపై మరింత నీరు!

పాక్‌లో 40 వేల మంది ఉగ్రవాదులు!

బ్యూటీక్వీన్‌కు విడాకులిచ్చిన మాజీ రాజు!

ఉడత మాంసం వాసన చూపిస్తూ..

మాస్టర్‌ చెఫ్‌; 40 శాతం పెంచితేనే ఉంటాం!

అదొక భయానక దృశ్యం!

ఆ షూస్‌ ధర రూ. 3 కోట్లు!

నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ మరణం; రహస్య ఒప్పందం?!

అందుకే మా దేశం బదనాం అయింది: పాక్‌ ప్రధాని

భయానక అనుభవం; తప్పదు మరి!

‘మేమిచ్చిన సమాచారంతోనే లాడెన్‌ హతం’

ఊచకోత కారకుడు మృతి

అదంతే..అనాదిగా ఇంతే!

ఆ యాప్‌లో అసభ్యకర సందేశాలు!

బ్రిటన్‌ నూతన ప్రధానిగా బోరిస్‌ జాన్సన్‌

బుడుగులకో ‘సెర్చ్‌ ఇంజన్‌’!

ఆడి కారు కోసం... ఇంట్లోనే డబ్బులు ప్రింట్‌ చేసి..

అక్కడ సెల్ఫీ తీసుకుంటే అదుర్స్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘వాళ్లు భావోద్వేగానికి లోనయ్యారు’

బాబా భాస్కర్‌-జాఫర్‌ల మధ్య గొడవ

ఆ సెలబ్రిటీ జోడీ పెళ్లి ఇప్పట్లో లేనట్టే..

‘ఇండియన్‌-2’ కోసం క్యాస్టింగ్‌ కాల్‌

ఇంకా సస్పెన్స్‌గానే కేజీఎఫ్‌-2..సంజూనే కదా?!

సరికొత్త గెటప్‌లో ‘ఖిలాడి’...!