షాక్‌.. పప్పీ అనుకుని పెంచింది.. కానీ..

16 May, 2018 11:02 IST|Sakshi

బీజింగ్‌ : చాలా మందికి జంతువులను పెంచుకోవడం ఇష్టం. అలానే ఓ మహిళ చిన్న పప్పీని పెంచుకుకోవడానికి రెండేళ్ల క్రితం ఇంటికి తెచ్చుకుంది. ఆ తర్వాత మహిళకు తాను పెంచుతున్నది పప్పీ కాదు ఎలుగుబంటి అనే వాస్తవం తెలిసింది. అంతే ఇంకేముంది ప్రాణం పోయినంత పని అయింది. ఆమె వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించింది. ఈ ఘటన చైనాలోని యూనాన్‌లో చోటుచేసుకుంది. 

వివరాలివి.. చైనాకు చెందిన ఓ మహిళ ఓ నల్లని జంతువును శునకంగా భావించి ఇంటికి తెచ్చుకుంది. అది శునకం జాతుల్లో ఒక రకమని భావించింది.కానీ కొన్నిరోజుల తర్వాత దాని బరువు 200 కేజీలకు చేరుకుంది. దీంతో ఆ మహిళకు అనుమానం వచ్చి పప్పీని పరిశీలించింది. అంతే అది శునకం కాదు ఎలుగుబంటి అని తెలుసుకుంది. భయంతో ఆ మహిళ అటవీ అధికారులకు సమాచారం అందించింది. 

వెంటనే అధికారులు ఆమె ఇంటికి చేరుకుని ఆ ఎలుగుబంటిని బోనులో బందించారు. ఆ ఎలుగు బంటి చాలా ప్రమాదకమైననదిగా వారు చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ దానిని ఇంటికి తీసుకొచ్చి ‘లిటిల్‌​ బ్లాక్‌’  అని పెరు పెట్టాను. కానీ అది రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది. అప్పుడు నాకు అనుమానం వచ్చింది. అంతే అది ఎలుగు బంటి అని తెలిసే సరికి చాలా భయపడ్డాను. అంతేకాక అది రోజుకు రెండు బకెట్ల న్యూడిల్స్  తినేది’ అని ఆమె తెలిపింది.

మరిన్ని వార్తలు