సెల్‌ఫోన్‌ చూస్తే.. ఇలాంటి చావులే?!

9 Dec, 2017 16:21 IST|Sakshi

మొబైల్‌.. ఇప్పుడు హస్తాలంకార భూషణంగా మారిపోయింది. చిన్నాపెద్దా, ఆడమగా అన్నా తేడా లేకుండా.. స్మార్ట్‌ఫోన్‌ చూస్తూ పనులు చేస్తున్నాం. ఇంట్లో ఉన్నా.. ప్రయాణాల్లో ఉన్నా... ఎక్కడున్నా కళ్లు మాత్రం స్మార్ట్‌ ఫోన్‌ స్క్రీన్‌ మీదే. ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్న యువతి కూడా అచ్చం మనలాంటిదే.  పేరు తెలియదు కానీ.. చైనాలోని నాన్‌జింగ్‌ సిటీలో నివసిస్తోంది. సఆఫీస్‌ నుంచి ఇంటికి తిరిగి వెళ్లేందుకు పార్కింగ్‌ ప్లేస్‌కు వచ్చింది. అక్కడ కూడా కార్‌ పార్కింగ్‌ను గమనించకుండా.. స్మార్ట్‌ స్క్రీన్‌ మీద వేళ్లు టకటకలాడిస్తూ.. ముం‍దుకు నడుస్తోంది.

చైనాలోని కార్యాలాయాల్లో పార్కింగ్‌ మొత్తం అడ్వాన్స్‌డ్‌ స్థాయిలో ఉంటుంది. అండర్‌గ్రౌండ్‌లో కార్లను వరుసగా.. ఒకదానిమీద ఒకటి పేరుస్తారు. అవసరమైన కారును లిఫ్ట్‌ సహాయంతో బయటకు తెస్తారు. ఆ సమయంలో కార్‌ లిఫ్ట్‌ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఫొన్‌ చూసుకుంటున్న యువతి.. ఆ ధ్యాసలోనే కార్‌ లిఫ్ట్‌లోకి వెళ్లిపోయింది. లిఫ్ట్‌ డోర్లకు ఆటోమేటిక్‌ లాకింగ్‌ సిస్టం ఉండడంతో యువతి అక్కడే ఆగిపోయింది. ఇంతలో లిఫ్ట్‌ కిందకు దిగడం.. అదే సమయంలో.. వెంటనే ఎదురుగా కారు రావడం.. ఆమెను ఢీ కొట్టడం వేగంగా జరిగిపోయాయి. ప్రాణం పోయినంత పనైనా.. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. సీసీటీవీలో రికార్డయిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

మరిన్ని వార్తలు