ఈఫిల్ టవర్ వద్ద సామూహిక లైంగిక దాడి

19 Sep, 2016 12:25 IST|Sakshi
ఈఫిల్ టవర్ వద్ద సామూహిక లైంగిక దాడి

పారిస్: మాయమాటలు చేసి రప్పించి ముగ్గురు వ్యక్తులు ఈఫిల్ టవర్ వద్ద ఓ మహిళపై లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటన పారిస్లోని ఈఫిల్ టవర్ వద్ద చోటుచేసుకుంది. ఈ లైంగిక దాడికి పాల్పడిన ముగ్గురిలో ఒకరు ఆమెతో ఫేస్బుక్ లో చాట్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం అల్జీరియాకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఫ్రాన్స్కు చెందిన ఓ మహిళతో ఫేస్ బుక్లో పరిచయం పెంచుకున్నారు.

వారిలో ఒకతను ఆమెకు మాయమాటలు చెప్పి బాగా దగ్గరవ్వగా ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడేందుకు ముందే వ్యూహం పన్నారు. పథకం ప్రకారం ఆమెను పారిస్ లోని ఈపిల్ టవర్ వద్దకు రప్పించారు. అనంతరం ఆమెపై అక్కడే ఉన్న చాంప్ దే మార్స్ గార్డెన్లో లైంగిక దాడి చేశారు. ఆ ముగ్గురుని ఓ హోటల్ లో పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి భద్రత, విచారణ దృష్ట్యా పోలీసులు ఇంతకంటే ఎక్కువగా వివరాలు అందించలేదు.

మరిన్ని వార్తలు