డేటింగ్‌కు వెళ్లి కిటికీలో ఇరుక్కుంది

6 Sep, 2017 17:19 IST|Sakshi
డేటింగ్‌కు వెళ్లి కిటికీలో ఇరుక్కుంది

లండన్‌: అప్పటి వరకు ఆహ్లాదంగా ఉన్న వారిగదిలో ఒక్కసారిగా భయాందోళనలు చుట్టుముట్టాయి. జాలీగా, సరదాగా ఆ రాత్రంతా గడిపేద్దామనుకున్న వారిని టైం వెక్కిరించింది. చాటుమాటుగా చేద్దామనుకున్న వారి పనిని బట్టబయలుచేసింది. చివరకు అగ్నిమాపక సిబ్బంది వస్తేగానీ వారి సమస్య పరిష్కారం అయింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బ్రిటన్‌కు చెందిన ఓ మహిళ టిండర్‌ అనే మొబైల్‌ యాప్‌ ద్వారా లియామ్‌ స్మిత్‌ అనే వ్యక్తితో పరిచయం పెంచుకుంది. అదికాస్త గాఢంగా మారి అతడితో డేటింగ్‌ చేయాలనుకుంది. అనుకుందే తడువుగా బ్రిస్టల్‌లోని స్మిత్‌ ఇంట్లో వారిద్దరు ఏకాంతంగా గడిపేందుకు ప్లాన్‌ చేసుకున్నారు. ఏం చక్కా మద్యం, కొన్ని ఆహారపదార్థాలు తెచ్చుకున్నారు.

మద్యం సేవిస్తుండగా మద్యలో ఆ మహిళ టాయిలెట్‌లోకి టిష్యు పేపర్‌ను లాగే ప్రయత్నం చేయగా అది కాస్త రెండు కిటికిల సందులో పడింది. దీంతో ఆమె దానిని అందుకునే ప్రయత్నం చేస్తూ పూర్తిగా అందులోకి ఇరుక్కుపోయి కేకలు వేయడం ప్రారంభించింది. అది చూసిన స్మిత్‌కు ఏ చేయాలో అర్ధం కాలేదు. అతడు ఎంత ప్రయత్నించినా ఆమెను బయటకు తీయడం సాధ్యం కాలేదు. ఇక చేసేది లేక అగ్నిమాపక సిబ్బందిని ఆశ్రయించగా వచ్చి చూసిన వారు ఆశ్చర్యపోయి తమలో తామే నవ్వుకున్నారు. అనంతరం విండోను పగులగొట్టి బయటకు తీశారు. ఈ విషయం కాస్త అటుఇటూ అందరికి తెలిసిపోయింది. ఈ ఘటనలో అతడికి కాస్తంత ఉపశమనం కలిగింది.. అదేమిటంటే ఈ ఘటన కారణంగా పగిలిపోయిన తన కిటికీని తిరిగి బాగుచేయించుకునేందుకు గో ఫండ్‌ మి ద్వారా సాయం అందింది.

మరిన్ని వార్తలు