తలుపు తెరిచి చూసి షాకైంది!

1 Apr, 2020 11:14 IST|Sakshi
ఇంటి బయల ఉన్న పైథాన్‌

కాన్‌బెర్రా : ఇంటి ముందు అనుకోని అతిథి ప్రత్యక్షమవటంతో ఓ మహిళ గుండె ఝల్లుమంది. తలుపు దగ్గర 14 అడుగుల కొండచిలువను చూసి షాక్‌కు గురైంది. ఈ సంఘటన ఆస్ట్రేలియాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. వారంరోజుల క్రితం క్వీన్స్‌లాండ్‌కు చెందిన ఓ మహిళ పనిమీద బయటకు వెళుతూ ఇంటి తలుపు తెరిచింది. బయటకు అడుగుపెట్టబోతూ కిందకు చూసింది. అంతే షాక్‌ తిన్నట్లు అయిపోయింది. అక్కడి నేలపై 14 అడుగుల అల్బినో బర్మీస్‌ పైథాన్‌ ఉండటం చూసి ఆమె గుండె ఝల్లుమంది. వెంటనే తలుపు మూసి, పాములను పట్టుకునే సిబ్బందికి సమాచారం అందించింది. ఇంటి దగ్గరకు వచ్చిన వారు పామును బంధించారు.

14 అడుగుల అల్బినో బర్మీస్‌ పైథాన్‌

ఈ సందర్భంగా పాములను పట్టుకునే సిబ్బంది ఒకరు మాట్లాడుతూ.. ‘‘ మేము పట్టుకున్న పాములలో ఇదే అతి పెద్దది. దాదాపు 80 కేజీల బరువుంది. ఆరోగ్యంగా కూడా ఉంది. ఈ బర్మీస్‌ పైథాన్‌లు ఇక్కడివి కాదు. ఎవరో దాన్ని అక్రమంగా పెంచుకుంటున్నారు. వారెవరో తెలిస్తే జీవితాంతం జైలులో ఉండాల్సి వస్తుంద’ని హెచ్చరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

మరిన్ని వార్తలు