కాక్‌పిట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నం.. సిబ్బందిపై దాడి

20 Jul, 2019 18:38 IST|Sakshi

లండన్‌: కాక్‌పిట్‌లోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించడమే కాక.. విమనా సిబ్బందిపై దాడి చేసినందుకు గాను ఓ యువతిపై జీవితకాలం విమానయానం చేయకూడదంటూ నిషేధం విధించారు. వివరాలు.. చ్లోయి హైనెస్‌(22) అనే యువతి గత నెల 22న తన బామ్మతో కలిసి యూకే నుంచి టర్కీకి ప్రయాణిస్తుంది. ఈ క్రమంలో విమానం గాల్లో ఉండగా.. ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ను తెరవడానికి, కాక్‌పిట్‌లోకి వెళ్లడానికి ప్రయత్నించింది. అడ్డుకోబోయిన ఇద్దరు సిబ్బంది మీద దాడి చేసి వారిని గాయపర్చింది. ఆపడానికి ప్రయత్నించిన ప్రయాణికులపై కూడ దాడి చేసింది.

ఈ విషయం గురించి సదరు విమానయాన సంస్థ సీఈవో మాట్లాడుతూ.. ‘నా జీవితంలో ఇలాంటి ప్రయాణికురాలిని ఇంతవరకూ చూడలేదు. ఆమె చూడ్డానికి చాలా చిన్నగా ఉంది. కానీ చాలా బలవంతురాలు. ఆమె తీరు చూస్తే.. మా మీద యాసిడ్‌ పొయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు తోచింది. ఆమె సృష్టించిన బీభత్సం వల్ల విమానాన్ని వెనక్కి తీసుకురావాల్సి వచ్చింది. కానీ ఆమె చేసిన పనికి తగిన మూల్యం చెల్లించక తప్పదు. ఆమె ప్రవర్తన వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడటమే కాక.. డబ్బు కూడా వృథా అయ్యింది. ఆ మొత్తన్ని ఆమె నుంచి తిరిగి రాబడతాం. అందుకనే ఆమె మీద రూ. 72 లక్షల జరిమానాతో పాటు.. జీవితాంతం విమానంలో ప్రయాణించకుండా నిషేధం విధించామ’ని తెలిపాడు.

మరిన్ని వార్తలు