విమానంలో మహిళకు భయంకర అనుభవం!

9 Dec, 2019 14:13 IST|Sakshi

అట్లాంటా: విమానంలో ప్రయాణించేటపుడు కొన్ని అరుదైన ఘటనలు జరుగుతుంటాయి. దీనివల్ల ప్రయాణికులు బెంబేలెత్తిపోయిన సందర్భాలు కోకొల్లలు. తాజాగా యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణిస్తున్న ఓ మహిళకు భయంకర అనుభవం ఎదురు కాగా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది. వివరాలు.. ఓ మహిళ గురువారం ఉదయం పూట శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి అట్లాంటా బయలు దేరింది. విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఓ తేలు ఆమె కాలిపై అదేపనిగా కాట్లు వేసింది. దీంతో మహిళకు నొప్పి భరించలేకుండా ఉండటంతో బాత్రూంలోకి వెళ్లింది.

ఇంకా ఏదో కుడుతున్నట్టుగా అనిపించడంతో మహిళ ప్యాంటు చెక్‌ చేసుకోగా.. అందులో నుంచి ఓ తేలు బయటపడింది. అది కూడా సజీవంగా ఉండటంతో ఆమె భయభ్రాంతులకు లోనైంది. ఈ క్రమంలో ఎయిర్‌లైన్స్‌ సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. విమానం ల్యాండ్‌ అయ్యాక సదరు మహిళను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇక బాధితురాలికి విమానంలోనే ‍ప్రాథమిక చికిత్స అందించామని ఎయిర్‌లైన్స్‌ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా ప్రస్తుతం ఆ మహిళ క్షేమంగా ఉంది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా