పెళ్లికి ముందు శృంగారం; జంటకు శిక్ష

1 Aug, 2019 18:44 IST|Sakshi

జకార్తా : షరియా చట్టాలను ఉల్లంఘిస్తూ పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొన్న ఓ జంటను షరియా అధికారులు కఠినంగా శిక్షించారు. యువతీయువకుడి వీపుపై వంద బెత్తం దెబ్బలతో విమానం మోత మోగించారు. ఈ సంఘటన బుధవారం ఇండోనేషియాలోని అకే ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇండోనేషియా అకే ప్రావిన్స్‌కు చెందిన ఓ ప్రేమికుల జంట వివాహం చేసుకోకుండానే శృంగారం చేస్తూ పట్టుబడ్డారు. దీంతో షరియా అధికారులు వారికి వంద బెత్తం దెబ్బల శిక్ష విధించారు. వీరిని శిక్షించటానికి ఓ వేదికను ఏర్పాటు చేశారు. మొదట యువతిని వేదికపై నిలబెట్టి బెత్తంతో కొట్టడం ప్రారంభించారు.

దెబ్బల దాటికి తాళలేక యువతి కన్నీరుమున్నీరైంది. విడిచి పెట్టమని షరియా అధికారుల కాళ్లావేళ్లాపడింది. అయినా అధికారులు కనికరించలేదు. యువతి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ వంద దెబ్బలు కొట్టిన తర్వాతే వదిలిపెట్టారు. ఇక ఆమె ప్రియుడికి కూడా ఇదే శిక్షను విధించారు.  ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో జూదం, మద్యం సేవించటం, స్వలింగ సంపర్కం, పెళ్లికి ముందు శృంగారం వంటి వాటికి బెత్తంతో వంద దెబ్బలు కొట్టే శిక్షలు విధిస్తుంటారు. కాగా గత మార్చి నెలలో కూడా ఒకరి చేతులు మరొకరు పట్టుకుని నడిచిన ముస్లిం అవివాహిత యువతీ యువకులకు సైతం వంద బెత్తం దెబ్బలు రుచిచూపించారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మాల్దీవుల మాజీ ఉపాధ్యక్షుడు అరెస్టు

వైరల్‌ : విరుచుకుపడిన ‘సునామీ’ అలలు..!

కులభూషణ్‌ జాధవ్‌ కేసు: పాక్‌ కీలక నిర్ణయం

20 ఏళ్ల తర్వాత కలిసిన బంధం

రావణుడే తొలి వైమానికుడు

బిన్‌ లాడెన్‌ కొడుకు హంజా మృతి!

స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ లండన్‌

హృదయ కాలేయం@వరాహం

సీటు బెల్టు కత్తిలా మారి ఆమె కడుపును..

అతని పాటకు గాడిద గొంతు కలిపింది: వైరల్‌

బలవంతపు పెళ్లి నుంచి రక్షణ కల్పించండి

బాంబు పేలుడు..34 మంది మృతి!

సోషల్‌ మీడియా ఫేం దారుణ హత్య!

వామ్మో.. ఇది చాలా డేంజర్‌ పక్షి!

చందమామ ముందే పుట్టాడు

పాక్‌లో ఇళ్లపై కూలిన విమానం  

ఇద్దరమ్మాయిల లవ్‌స్టోరీ ఫొటోలు.. వైరల్‌

తలలు ఓ చోట, మొండాలు మరోచోట..

జనావాసాల్లో కూలిన విమానం.. 17 మంది మృతి

200 ఏళ్ల నాటి రావి చెట్టు రక్షణ కోసం...

ఇమ్మిగ్రేషన్‌ అలర్ట్‌: ట్రంప్‌ సర్కార్‌ సంచలన నిర్ణయం

బెంగళూరులో చౌకగా బతికేయొచ్చట!

ఆరేళ్లకే..రూ. 55 కోట్ల భవనం కొనుగోలు!

గార్లిక్‌ ఫెస్టివల్‌లో కాల్పులు, ముగ్గురు మృతి

ఇజ్రాయెల్‌ ఎన్నికల్లో ‘మోదీ’ ప్రచారం 

బోయింగ్‌కు ‘సెల్‌ఫోన్‌’ గండం

వైరల్‌: షాక్‌కు గురిచేసిన చికెన్‌ ముక్క!

ద్వీపపు దేశంలో తెలుగు వెలుగులు..!

దావూద్‌ ‘షేర్‌’ దందా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ హౌస్‌లో పవర్‌ గేమ్‌

ఏం కలెక్షన్లురా బై..!

ఆమె హీరోయిన్‌గా పనికి రాదు: నటుడు

బిగ్‌బాస్‌ 3: నాగ్‌ రికార్డ్‌!

బిగ్‌బాస్‌.. టీఆర్పీ రేటింగ్‌లకు బాస్‌

సాహో: శ్రద్ధాకి కూడా భారీగానే!