చిన్న అబద్ధం, పెద్ద శిక్ష పడే అవకాశం!

2 Jun, 2020 20:20 IST|Sakshi

సింగపూర్‌: కరోనా కట్టడికి మాస్క్‌లు, శానిటైజర్లు ఎంతో అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో ఇవి రెండు నిత్యవసరాల్లా మారిపోయాయి.  వీటి కొరత కరోనా వ్యాపిస్తున్న తొలి రోజుల్లో చాలా ఎక్కువగా ఉండేది. అకస్మాత్తుగా కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాపించడం, లాక్‌డౌన్‌ విధించడం లాంటి కారణాల వల్ల మాస్క్‌లు అందరికి అందుబాటులో ఉండేవి కాదు. అయితే ఇదే పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుంది సింగపూర్‌లోని ఒక రేడియోలాజిస్ట్‌. తన వద్ద మాస్క్‌లు ఉన్నాయని నమ్మబలికి ఏకంగా 23 మందిని 1500 డాలర్ల మేర మోసం చేసింది. ఈ విషయంలో ఆమెను జూన్‌ 2న అరెస్ట్‌ చేయగా ప్రస్తుతం ఎనిమిది వారాల పాటు జైలులో ఉంచడంతో పాటు 3000 డాలర్ల ఫైన్‌ను విధించారు. (లాక్డౌన్ ఎత్తివేత.. డబ్బు ఇవ్వలేం: ఇమ్రాన్ ఖాన్)

అసలేం జరిగిందంటే, 24 ఏళ్ల యునిస్ అనికో లివానాగ్ జనవరి 28 నుంచి ఫిబ్రవరి 1 మధ్య తన వద్ద ఫేస్‌మాస్క్‌లు ఉన్నాయంటూ 23 మందిని మోసం చేసింది. జనవరి 30న ల్యూచెన్‌(39) అనే వ్యక్తి యునిస్ అనికో లివానాగ్ ఆన్‌లైన్‌ మార్కెట్‌ప్లేస్‌ కరౌసెల్‌ అకౌంట్‌కు మాస్క్‌లు ఉన్నాయా అంటూ ఒక మెసేజ్‌ చేశాడు. తన వద్ద మాస్క్‌లు లేనప్పటికి ఉన్నాయంటూ లివానాగ్‌ అతని వద్ద నుంచి 150 డాలర్లు తీసుకుంది. ఇదే విధంగా మిగిలిన బాధితులందరి దగ్గర నుంచి లివానాగ్‌ దాదాపు 1500 డాలర్ల వరకు తీసుకుంది. తన మీద అనుమానం రాకుండా ఉండటానికి ఫిబ్రవరి 1వ తేదీన తన అకౌంట్‌లోకి ఎక్కడి నుంచో తెలియకుండా డబ్బులు వస్తున్నాయని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేయగా ఆన్‌లైన్‌ షాపింగ్‌కు మాత్రమే తను అకౌంట్‌ను ఇచ్చాను అని చెప్పింది. ఈ సందర్భంగా కేసును విచారిస్తున్న ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ, లివానాగ్‌ ముందుగా ఫిర్యాదు చేయడంతో ఈ కరౌసెల్‌ స్కామ్‌ విషయంతో మేం లివానాగ్‌ను మొదట అనుమానించలేదు అని తెలిపారు. 23 మందిని మోసం చేసిన తరువాత భయపడి, తన మీద అనుమానం రాకుండా ఉండటం కోసమే లివానాగ్‌ అబద్ధపు ఫిర్యాదు చేసిందని కూడా పోలీసు అధికారి పేర్కొన్నారు. (ఖరీదైన విడాకులు : కొత్త బిలియనీర్గా ఆమె!)

ఈ కేసును కోర్టులో విచారించగా పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. తను దొరకకుండా ఉండటానికి లివానాగ్‌ మూడు సార్లు తన యూజర్‌ నేమ్‌ని మార్చినట్లు తెలిసింది. అందరిని ఒకే విషయంలో మోసం చేసినట్లు తేలింది. ఈ కేసును విచారించిన కోర్టు ఆమె కావాలనే ఉద్దేశపూర్వకంగా వారందరిని మోసం చేసిందని పేర్కొంది. ఈ మోసం చిన్నదిగా కనిపిస్తున్నప్పటికి నేరం నిరూపితమైతే ఒక్కొక్కమోసానికి ఆమెకు దాదాపు పదేళ్లపాటు శిక్ష పడనుంది.  

మరిన్ని వార్తలు