వైరల్‌: చావు అంచుల దాక వెళ్లి..

2 Mar, 2020 19:03 IST|Sakshi

కన్న బిడ్డల జోలికొస్తే ఏ తల్లి ఊరుకోదు. వారి ప్రాణాలకు ముప్పు ఉందని తెలిస్తే.. ఎదురుగా ఉన్నది ఎవరైనా తీవ్రంగా ప్రతిఘటిస్తుంది. ప్రాణాలు ఫణంగా పెట్టయినా పిల్లలకు పునర్జన్మ ప్రసాదిస్తుంది. పై ఫొటోలో కనిపిస్తున్న వడ్రంగి పిట్ట కూడా అదే చేసింది. చెట్టు గూడులో చొరబడి తన గుడ్లను స్వాహా చేద్దామనుకున్న ఓ భారీ పాముతో ఫైటింగ్‌ చేసింది. దాదాపు నాలుగు సార్లు దానిని ముక్కుతో పొడుస్తూ.. తరిమి కొట్టింది. 10 ఫీట్ల పొడవున్న పామును ఎదుర్కొనే క్రమంలో వడ్రంగి పిట్ట చావు అంచులదాక వెళ్లొచ్చింది.

అయితే, ఇది 11 ఏళ్ల క్రితం వీడియో. ఇజ్రాయెల్‌ టూరిస్టు అసఫ్‌ అద్మోని అనే టూరిస్టు ఈ వీడియోను పెరూ దేశంలో చిత్రీకరించారు. యూటూబ్‌లో ఈ వీడియోకు 8 మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి. సుశాంత నందా అనే ఇండియన్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ ఈ వీడియోను తాజాగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో విపరీతంగా వైరల్‌ అయింది.

మరిన్ని వార్తలు