భారత్‌కు భారీ సాయం

16 May, 2020 06:12 IST|Sakshi

ప్రపంచబ్యాంక్‌ 1 బిలియన్‌ డాలర్ల రుణం

న్యూఢిల్లీ: కోవిడ్‌–19తో ఆర్థికంగా కుదేలైన భారత్‌ను ఆదుకోవడానికి ప్రపంచ బ్యాంకు ముందుకు వచ్చింది. నిరుపేదల సంక్షేమం కోసం 1బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.7,500 కోట్లు) రుణాన్ని విడుదల చేయనుంది. పట్టణాల్లో నిరుపేదలు, వలస కూలీల సంక్షేమం కోసం ఈ రుణాల్ని అందిస్తున్నట్టుగా వరల్డ్‌ బ్యాంకు ఇండియా డైరెక్టర్‌ జునాయిద్‌ అహ్మద్‌ శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ప్రధాని ప్రకటించిన ఆత్మనిర్భర్‌ మిషన్‌ దేశాన్ని సరైన దిశగా ప్రయాణించేలా బాటలు వేస్తుందన్నారు. గతంలో ఇచ్చిన సాయానికి అదనంగా ఈ మొత్తాన్ని అందిస్తున్నట్టుగా ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు