అందరి చూపూ కొత్త ఐఫోన్ మీదే!

11 Mar, 2016 09:33 IST|Sakshi
అందరి చూపూ కొత్త ఐఫోన్ మీదే!

వాషింగ్టన్: ప్రపంచ మార్కెట్లో ఇప్పుడు అందరి చూపూ.. యాపిల్ సంస్థ కొత్తగా లాంచ్ చేయనున్న ఐఫోన్ మీదే ఉంది.  కొన్ని నెలలుగా యాపిల్ అమ్మకాలు ఆశించిన మేర వృద్ధి సాధించకపోవడంతో ఈ కొత్త ఐఫోన్ యాపిల్ అమ్మకాలకు పునరుత్తేజాన్నిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

గత కొంత కాలంగా యాపిల్ ఐఫోన్ అమ్మకాలు క్రమంగా క్షీణిస్తున్న ఈ నేపథ్యంలో యాపిల్ స్టాక్స్ విలువ ఐబీఎమ్‌కు దగ్గరగా రావడం వాల్‌స్ట్రీట్ మార్కెట్ వర్గాలను నిరాశ పరిచింది. అయితే గత రెండు వారాలుగా యాపిల్ యాపిల్ షేర్ల విలువ 5 శాతం మేర పెరిగింది.  యాపిల్ ఈ నెలలో లాంచ్ చేయనున్న కొత్త ఐఫోన్‌ను, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని మార్కెట్‌ను ఆకర్షించేలా తక్కువ కాస్ట్‌కు అందించనుందన్న వార్తలు ఈ షేర్ల విలువ పెరగటానికి దోహదం చేశాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ప్రజల అంచనాలకు అందనంత ఉత్తమమైన ఉత్పత్తులను యాపిల్ సంస్థ తీసుకొచ్చిన సందర్భాలున్నాయని, ఈ సారి కూడా అలాంటి ఆశ్చర్యం తప్పదని ఆపిల్ సంస్థలో 1 మిలియన్‌కు పైగా షేర్లు ఉన్న సైనోవాస్ ట్రస్ట్ కంపెనీ సీనియర్ పోర్ట్ ఫోలియో మేనేజర్ డేనియల్ మోర్గాన్ అన్నారు. మరి మార్కెట్ వర్గాల అంచనాలను యాపిల్ తన కొత్త ఐఫోన్‌తో అందుకుంటుందా అనేది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.
 

మరిన్ని వార్తలు