8 వేల ఏళ్ల నాటి ముత్యం

21 Oct, 2019 03:05 IST|Sakshi

అబుధాబి: యూఏఈలోని మరవాహ్‌ ద్వీపంలో జరిపిన తవ్వకాల్లో అత్యంత ప్రాచీన ముత్యం బయల్పడింది. ఇది 8 వేల ఏళ్ల నాటి నియోలిథిక్‌ కాలానికి చెందిందని పురాతత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అక్టోబర్‌ 30 నుంచి ప్రారంభం కానున్న లౌవ్రె అబుధాబి ఎగ్జిబిషన్‌లో ఈ ముత్యాన్ని ప్రదర్శించనున్నారు. ముత్యపు పొరలపై జరిపిన కార్బన్‌ డేటింగ్‌లో ఇది క్రీ.పూ 5800–5600 కాలానికి సంబంధించిందిగా తేలినట్లు అధికారులు వెల్లడించారు. యూఏఈలో దొరికిన అత్యంత ప్రాచీన వస్తువు కూడా ఇదే కావడం గమనార్హం.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు