చీప్‌ సిటీగా బెంగళూరు

29 Jul, 2019 14:46 IST|Sakshi

లండన్‌: ప్రపంచంలోని అత్యంత చౌకైన నగరాల జాబితాలో బెంగళూరుకు చోటు దక్కింది. ఎకనామిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ ప్రపంచంలోనే తక్కువ ఖర్చుతో బతికేయగల 10 నగరాల జాబితాను ఆదివారం విడుదల చేసింది. ఇందులో వెనిజులా రాజధాని కరాకస్‌ మొదటి స్థానాన్ని సంపాదించుకోగా సిరియా రాజధాని డమాస్కస్‌ రెండవ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో భారత్‌ నుంచి 3 నగరాలు చోటు దక్కించుకున్నాయి. బెంగళూరు 5వ స్థానంలో ఉండగా చెన్నై, ఢిల్లీ 8, 10వ స్థానాల్లో నిలిచాయి. 2019 సంవత్సరానికిగాను ఎకనామిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌, జీవన వ్యయం ఆధారంగా ఈ జాబితాను తయారు చేసింది. కాగా బెంగళూరును చౌకైన నగరంగా గుర్తించడంపై నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ, చెన్నై నగరాల కన్నా బెంగుళూరు అత్యంత ఖరీదైన నగరమని నెటిజన్లు గగ్గోలు పెడుతున్నారు.

ప్రపంచంలోని అత్యంత చౌకైన నగరాలు
1. కరాకస్ (వెనెజులా)
2. డమాస్కస్ (సిరియా)
3. తాష్కెంట్ (ఉజ్బెకిస్తాన్)
4. అల్మాటి (కజకిస్థాన్)
5. బెంగళూరు (భారత్)
6. కరాచి (పాకిస్తాన్)
6. లాగోస్‌ (నైజీరియా)
8. బ్యూనస్‌ ఐరిస్‌(అర్జెంటీనా)
8. చెన్నై (భారత్)
10. న్యూఢిల్లీ (భారత్)

మరిన్ని వార్తలు