భూలోక స్వర్గం ఈ ‘గిటార్‌’ హోటల్‌

25 Oct, 2019 18:44 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో హాలివుడ్‌లో అత్యంత విశాల విలాసవంతమైన ‘గిటార్‌’ హోటల్‌ గురువారం రాత్రి హాలివుడ్‌ సెలబ్రిటీల కోలాహాలం మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. అచ్చం గిటార్‌ ఆకృతిలో నిర్మించిన ఈ హోటల్లో ఏడు వేల సీట్లు కలిగిన కాసినో ఫ్లోర్, 1200 హోటల్‌ గదులు, మూడులేవ పండ్లు, ఫలహారాల మిషన్లు ఉన్నాయి. ఇవి కాకుండా పలు గేమింగ్‌ టేబుళ్లు, పలు సంగీత విభావరి వేదికలు ఉన్నాయి. 

స్థానిక అమెరికా సెమినోల్‌ ట్రైబ్‌కు చెందిన సంపన్నులు నిర్మించిన ఈ గిటార్‌ హోటల్‌ ప్రారంభోత్సవానికి క్లూ కర్దాషియన్, జానీ డెప్, మోర్గాన్‌ ఫ్రీమన్, సోఫి రిచీ తదితర సెలబ్రిటీలు హాజరయ్యారు. దక్షిణ ఫ్లోరిడాలో సెమినోల్‌ ట్రైబ్‌కు చెందిన ప్రజలు 4,200 మంది ఉన్నారు. 1979లో ‘హై స్టేక్స్‌ బింగో హాల్‌’ ఏర్పడినప్పుడు మొట్టమొదటి సారిగా ఈ జాతి జనులు గేమింగ్‌ కాసినో పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 

ఇప్పుడు ఈ హోటల్‌ల్లో కాసినోనే ప్రధాన ఆకర్షణగా హోటల్‌ను నిర్మించినప్పటికీ పేరుకు తగ్గట్లుగా సంగీతానికి ప్రాధాన్యత ఇస్తామని యాజమాన్యం ప్రకటించింది. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా అతి పెద్ద కృత్రిమ సరస్సు మధ్య 1200 గదులను విడి విడిగా నీటి మధ్యన నిర్మిచారు. గదిలో బస చేసే వారు గది చుట్టూ వుండే కొలను నీటిలోనే ఈదను వచ్చు. సమీపంలోని ఆరోగ్యానిచ్చే స్పాల సేవలను అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు. ఈ హోట్‌లో భూలోక స్వర్గం అవుతుందని యాజమాన్యం చెబుతోంది. ఈ హోటల్‌ నిర్మాణానికి దాదాపు లక్షన్నర కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయట. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా