తొలి ‘స్మార్ట్‌ ట్రైన్‌’ పరుగు మొదలైంది..

1 Nov, 2017 10:15 IST|Sakshi
స్మార్ట్‌ ట్రైన్‌

ఝుఝౌ : వర్చువల్‌ ట్రాక్స్‌పై నడిచే తొలి ‘స్మార్ట్‌ ట్రైన్‌’ పరగు మొదలుపెట్టింది. ఈ ఏడాది జూన్‌లో దీన్ని ప్రపంచానికి పరిచయం చేసిన చైనా.. హునన్‌ ప్రావిన్సులోని ఝుఝౌ నగరంలోని రద్దీ వీధుల్లో టెస్టు రన్‌ నిర్వహించింది. అటానమస్‌ రైల్‌ రాపిడ్‌ ట్రాన్సిట్‌(ఏఆర్‌టీ) సిస్టంతో ఈ రైలు నడుస్తుంది. మొత్తం మూడు పెట్టెలు ఉండే ఈ రైలులో ఒకేసారి 300 మంది ప్రయాణించొచ్చు.

పది నిమిషాల పాటు చార్జ్‌ చేస్తే 25 కిలోమీటర్లు నడుస్తుందీ స్మార్ట్‌ ట్రైన్‌. అయితే, అత్యధిక వేగం 70 కిలోమీటర్లు మాత్రమే. ప్రస్తుతం ఉన్న రైళ్లను తయారు చేయడానికి అవుతున్న ఖర్చుతో పోల్చుకుంటే స్మార్ట్‌ ట్రైన్‌ తయారీకి అయ్యే ఖర్చు చాలా తక్కువ. ప్రస్తుతం 3.31 కిలోమీటర్ల పరిధిలోని నాలుగు స్టేషన్లలో ఈ ట్రైన్‌ను చైనీయులు నడుపుతున్నారు.

ఎలా నడుస్తుందంటే..
స్మార్ట్‌ ట్రైన్‌ నడిచేందుకు రోడ్లపై ప్రత్యేకంగా వైట్‌ పెయింటింగ్‌తో ట్రాక్స్‌ను గీస్తారు. ఈ గీతల దారిలోనే స్మార్ట్‌ట్రైన్‌ పరుగులు తీస్తుంది.

మరిన్ని వార్తలు