ఈ ఫొటోలు మీరు కచ్చితంగా చూడాల్సిందే..

27 Jan, 2018 19:10 IST|Sakshi

కైరో : కొన్ని ఫొటోలు ఎన్నిసార్లు చూసినా పదే పదే చూడాలనిపిస్తుంది. కొన్ని ఆశ్చర్యాన్ని మరికొన్ని హాస్యాన్ని పుట్టిస్తాయి. చూడగానే పెదాలపై నవ్వును తెప్పిస్తాయి. అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న వారికి కూడా ఆ ఫొటోలు చూపించాలనిపిస్తుంది.. అందుబాటులో లేకుంటే సోషల్‌ మీడియాలో దూరి ఫ్రెండ్స్‌కు షేర్‌ చేసుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు ఆన్‌లైన్‌లో అలాంటి ఫొటోలే అమితంగా ఆకర్షిస్తున్నాయి. అవి ఏమిటంటే ప్రపంచంలోనే ఎత్తయిన వ్యక్తి, ప్రపంచంలో కెల్లా పొట్టి మహిళ కలిసి దిగిన ఫొటోలు.

ఇటీవల ఈజిప్టు పర్యటనకు వెళ్లిన వారు పిరమిడ్‌తోపాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫొటోలకు పోజిచ్చారు. సుల్తాన్‌ కోసెన్‌ (35) అనే వ్యక్తి ఎనిమది అడుగుల ఒక అంగుళం ఎత్తుతో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులో చోటు సంపాధించుకోగా జ్యోతి ఆంగే (24) అనే మహిళ కేవలం రెండు అడుగుల ఎత్తుండి గిన్నిస్‌ లో నిలిచిపోయింది. వీరిద్దరికి 2011లో ఈ రికార్డులో స్థానం దక్కింది. ఇప్పుడు వారిద్దరు కలిసి దిగిన ఫొటోలు చూపరులను కట్టిపడేస్తున్నాయి.. మీరు కూడా ఓ లుక్కేయండి మరీ!

మరిన్ని వార్తలు