1.9 లక్షలకు పెరిగిన కరోనా మరణాలు

24 Apr, 2020 19:17 IST|Sakshi

న్యూయార్క్‌ : ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారితో మరణించిన వారి సంఖ్య శుక్రవారానికి 1,90,000 దాటింది. కోవిడ్‌-19 మరణాల్లో మూడింట రెండు వంతుల మరణాలు యూరప్‌లోనే చోటుచేసుకున్నాయి. గత ఏడాది డిసెంబర్‌లో చైనాలో ఈ వైరస్‌ బయటపడినప్పటి నుంచి ఇప్పటివరకూ 26,98,733 మంది​కి వైరస్‌ సోకింది. ఇక ప్రపంచవ్యాప్తంగా నమోదైన 1,90,089 కరోనా మృతుల్లో అత్యధికంగా 49,963 మందితో అమెరికా ముందుంది.

ఇటలీలో 25,549 , స్పెయిన్‌లో 22157, ఫ్రాన్స్‌లో 21,856, బ్రిటన్‌లో18738 మంది మరణించారు. ఇక భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు 23 వేలు దాటాయి. గత 24 గంటల్లో 1,684 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 23,077కు పెరిగింది. వైరస్‌ బారినపడి ఇప్పటివరకు 724 మంది మరణించారు.

చదవండి : కరోనా: 20 మందికి పార్టీ.. ఆమెకు పాజిటివ్‌

మరిన్ని వార్తలు