‘దోహా’ను వేగంగా పూర్తిచేయాలి

16 Dec, 2015 02:10 IST|Sakshi

డబ్ల్యూటీఓకు భారత్ సహా 47 దేశాల పిలుపు
 
 నైరోబి: దీర్ఘ కాలంగా స్తంభించివున్న దోహా చర్చలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలను పూర్తిచేసేందుకు ప్రయత్నాలను రెట్టింపు చేయాలని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)ను భారత్, చైనా, పలు ఆఫ్రికా దేశాలు సహా 47 దేశాలకు చెందిన వాణిజ్య మంత్రులు కోరారు.162 దేశాలు పాల్గొంటున్న డబ్ల్యూటీఓ మంత్రుల స్థాయి సదస్సు మంగళవారం నైరోబిలో ప్రారంభమైంది. సదస్సు తొలి రోజునే భారత్ సహా 47 దేశాలు సంయుక్త ప్రకటన చేస్తూ.. దోహా అభివృద్ధి అజెండాను ఆర్థికపరంగా, సంతులిత ఫలితాలతో సమగ్రంగా పూర్తిచేయటం వల్ల అంతర్జాతీయ వాణిజ్య సరళీకరణకు, సులభతరానికి ఉత్తేజాన్నిస్తుందని తాము గుర్తిస్తున్నట్లు పేర్కొన్నాయి.

దానిని పూర్తిచేయటం ద్వారా.. అంతకుముందలి బహుళపక్ష వాణిజ్య చర్చల్లో రూపొందించిన నిబంధనల్లో అభివృద్ధి లోటు ను కూడా సరిచేస్తుందన్నాయి. 2001లో మొదలైన దోహా చర్చలపై తాము ముందుకు వెళ్లాలని భావించట్లేదని అభివృద్ధి చెందిన దేశాలు ప్రకటించిన నేపథ్యంలో ఈ 47 దేశాల సం యుక్త ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

మరిన్ని వార్తలు