77 ఏళ్ల తర్వాత..

19 Apr, 2016 16:24 IST|Sakshi
77 ఏళ్ల తర్వాత..

వియన్నా: రెండో ప్రపంచ యుద్ధంలో వేసిన 250 కిలోల బాంబును ఆస్ట్రియాలోని డోయేబ్లింగ్ జిల్లాలో దొరికింది. 1939 సెప్టెంబర్ 1 నుంచి 1945 సెప్టెంబర్ 2 వరకు జరిగిన ఈ యుద్ధంలో ఈ భారీ బాంబు వేసినా పేలకుండా ఉండిపోయింది. ఇటీవల భవన నిర్మాణం కోసం తీస్తున్న పునాదిలో 2.5 మీటర్ల లోతు వద్ద ఈ బాంబు వర్కర్ల కంట పడింది. బాంబ్ స్క్వాడ్ వెంటనే రంగంలోకి దిగి బాంబు ఉన్న ప్రదేశం చుట్టూ 300 నుంచి 400 మీటర్ల దూరాన్ని బ్లాక్ చేశారు. బాంబు దొరికిన ప్రదేశానికి రైల్వే ట్రాక్ చేరువలో ఉండటంతో రవాణ వ్యవస్థను నిలిపివేశారు.

మొదట ఈ బాంబును యూఎస్కు చెందినది భావించిన స్క్వాడ్.. దాన్ని అక్కడే నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించింది. కానీ, బాంబును సురక్షితంగా తరలించేందుకు వీలు కుదరడంతో అక్కడి నుంచి తరలించి రైల్వే వ్యవస్థను పునరుద్ధరించారు.

మరిన్ని వార్తలు